Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
'వారణాసి' తర్వాత జక్కన్న ప్లాన్ ఏంటి? చిన్న సినిమానా.. లేక

'వారణాసి' తర్వాత జక్కన్న ప్లాన్ ఏంటి? చిన్న సినిమానా.. లేక

Chitrajyothy 3 weeks ago

తెలుగు సినిమా స్థాయిని ప్రపంచ నలుమూలలకూ చాటిచెప్పిన దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి (SS Rajamouli). 'బాహుబలి', 'ఆర్‌ఆర్ఆర్' చిత్రాలతో టాలీవుడ్ రేంజ్‌ను ఎక్కడికో తీసుకెళ్లిన జక్కన్న..

ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబుతో కలిసి భారీ గ్లోబల్ అడ్వెంచర్ 'వారణాసి' (Varanasi) చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా అనౌన్స్‌మెంట్ వచ్చినప్పటి నుంచే ప్రేక్షకుల్లో అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ఇక 'వారణాసి' ఫస్ట్ గ్లింప్స్ అయితే అభిమానుల అంచనాలను మరో స్థాయికి తీసుకెళ్లింది. గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా కథానాయికగా నటిస్తుంటే, మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ ఈ మూవీలో విలన్ పాత్రతో అలరించనున్నారు. ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ గ్లోబల్ ట్రాటర్ చిత్రం, 2027 ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

ఇదిలా ఉంటే, ప్రస్తుతం సోషల్ మీడియాలోనూ, సినీ వర్గాల్లోనూ సరికొత్త చర్చ మొదలైంది. 'వారణాసి' తర్వాత జక్కన్న తీయబోయే నెక్ట్స్ ప్రాజెక్ట్ ఏంటి? ఎవరితో సినిమా ఉండబోతోంది?. గత కొంత కాలంగా కోలీవుడ్ స్టార్ హీరో సూర్య (Suriya)తో రాజమౌళి ఒక సినిమా చేయబోతున్నారనే వార్తలు వైరల్ అవుతున్నాయి. నిజానికి 2009లో వచ్చిన ఇండస్ట్రీ హిట్ 'మగధీర' కథకు ఫస్ట్ ఛాయిస్ సూర్యనే అనే విషయం చాలామందికి తెలుసు. సూర్య కూడా అనేక సందర్భాల్లో "రాజమౌళి గారితో కాంబినేషన్ మిస్సయింది, త్వరలోనే మేము కలిసి పనిచేస్తాం" అని చెప్పారు. ఈ క్రమంలోనే ఇటీవల వీరిద్దరి మధ్య చర్చలు కూడా జరిగాయని బలమైన టాక్ వినిపిస్తోంది. కానీ, ఈ కాంబినేషన్‌పై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

ఇక్కడే మరో ఆసక్తికరమైన ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ప్రతి సినిమాతో తన మార్కెట్, విజన్ స్కేల్‌ను పెంచుకుంటూ పోతున్న రాజమౌళి.. 'వారణాసి' తర్వాత అంతకంటే భారీ ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్‌తో వస్తారా? లేదంటే, గతంలో తీసిన 'మర్యాద రామన్న' తరహాలో ఒక చిన్న కథతో, పరిమిత బడ్జెట్‌లో సినిమాను ముగిస్తారా?. ఈ ప్రశ్నపై సినీ విశ్లేషకులు రకరకాల అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. 'వారణాసి' సినిమా రిజల్ట్, అంతర్జాతీయ మార్కెట్‌లో దానికి లభించే రెస్పాన్స్ ఆధారంగానే రాజమౌళి తన నెక్ట్స్ మూవీ స్కేల్‌పై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఒకవేళ గ్లోబల్ మార్కెట్‌లో ఈ చిత్రం సరికొత్త రికార్డులను తిరగరాస్తే, జక్కన్న మరింత భారీ విజన్‌తో ముందుకు వెళ్తారు. ఒకవేళ అంతర్జాతీయ షెడ్యూల్స్ నుంచి కాస్త విరామం కావాలని భావిస్తే, ఒక చిన్న కాన్సెప్ట్‌తో, తక్కువ బడ్జెట్‌లో సినిమాను తెరకెక్కించే అవకాశం ఉందనే విషయాన్ని కొట్టిపారేయలేమని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. మరి సూర్యతో భారీ కాంబినేషనా? లేక చిన్న బడ్జెట్ ఎంటర్‌టైనరా? సోషల్ మీడియాలో వస్తున్న ఈ రూమర్లన్నింటికీ ముగింపు దక్కాలంటే రాజమౌళి స్వయంగా స్పందించాల్సిందే!.

ఇవి కూడా చదవండి:

కొరియాలో షూట్ చేసినా ఎలాంటి కన్ఫ్యూజన్ ఉండదు: మెగా ప్రిన్స్

Lenin OTT: అయ్యగారి సినిమా ఈసారి ఆలస్యం కాకుండానే ఓటీటీకి..

జూలైలో అనువాద చిత్రాల హవా...

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Chitrajyothy