సీఎం విజయ్ (Vijay) అంటే తనకు అసూయ లేదని రజనీకాంత్ (Rajinikanth) క్లారిటీ ఇచ్చాడు. తమిళనాడు ఎన్నికల్లో విజయ్ గెలిచాకా ఇండస్ట్రీ మొత్తం అభినందించినా..
రజనీకాంత్ పోస్ట్ పెట్టకపోవడం, స్టాలిన్ ఓడిపోయాకా రజనీ స్వయంగా వెళ్ళి ఆయనను కలవడం పలు అనుమానాలకు దారితీసింది. దీంతో విజయ్ సీఎం అవ్వడం రజనీకాంత్ కి ఇష్టం లేదని, ఆయనకు అసూయగా ఉందని టాక్ నడిచింది. తాజాగా ఈ రూమర్స్ కి రజనీ చెక్ పెట్టాడు. ఒక ప్రెస్ మీట్ నిర్వహించి ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు చెప్పాడు.
'నేను ఇక రాజకీయాల్లోకి రాను. పార్టీ పెడితే ఖచ్చితంగా గెలిచేవాడిని. స్టాలిన్ నాకు మంచి మిత్రుడు. ఆయన ఓడిపోయాడు అని తెలియడంతో ఒకసారి వెళ్ళి పలకరించాను. అంతకు మించి ఏం లేదు. విజయ్ సీఎం అయినందుకు నాకు అసూయ లేదు. కమల్‌హాసన్ సీఎం అయితే నేను అసూయపడతాను. విజయ్ సీఎం అయ్యాడని విషయం తెలిసి మొదట షాకయ్యాను. సింగిల్‌గా పోటీచేసి రెండు పెద్ద పార్టీలపై గెలిచాడు. తమిళనాడు ప్రజలకు విజయ్ మంచి చేస్తాడనే నమ్మకం ఉంది. నన్ను.. విజయ్ తో పోల్చకండి. అది అతనికి మంచిది కాదు. విజయ్‌కు, నాకు 28 ఏళ్ల వ్యత్యాసం ఉంది' అని అన్నారు.
రజనీకాంత్ కెరీర్ విషయానికొస్తే.. ప్రస్తుతం ఆయన వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. జైలర్ 2 షూటింగ్ ఫినిష్ అవ్వనుంది. ఆ తరువాత శిబి చక్రవర్తి దర్శకత్వంలో తలైవర్ 173 సెట్స్ మీద ఉంది. ఈ రెండు కాకుండా రజనీ, కమల్ మల్టీస్టారర్ మొదలుకానుంది. మరి ఈ సినిమాలతో రజనీకాంత్ ఎలాంటి విజయాలను అందుకుంటాడో చూడాలి.

