Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
విజయ్‌కు వెంకట్ ప్రభు వింతైన కానుక!

విజయ్‌కు వెంకట్ ప్రభు వింతైన కానుక!

Chitrajyothy 5 days ago

వరైనా సీఎంకు గిఫ్ట్ ఇవ్వాల్సి వస్తే ఖరీదైన ఏ పంచలోహ విగ్రహమో, చారిత్రక కట్టడం రిప్లికానో ఇస్తారు. కానీ చిత్రంగా తమిళనాడు సీఎం విజయ్‌ (Vijay) కు ప్రముఖ దర్శకుడు వెంకట్ ప్రభు (Venkat Prabhu) కారు నెంబర్ ప్లేట్‌ను గిఫ్ట్ గా ఇచ్చాడు.

అంతేకాదు... ఆ ఫోటోను వెంకట్ ప్రభు సోషల్ మీడియోలో పోస్ట్ చేయడంతో దానిపై ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.

ఇంతకూ వెంకట్ ప్రభు ఎందుకు ఆ గిఫ్ట్ ఇచ్చాడంటే... ఆ నంబర్‌ ప్లేట్ విజయ్‌ హీరోగా రూపుదిద్దుకున్న 'గోట్‌' సినిమాలో అతను నడిపే కారు నంబర్‌. ఈ సినిమాకు వెంకట్ ప్రభునే దర్శకుడు. ఈ సినిమాలో విజయ్‌ ఉపయోగించే కారు నంబర్‌ టి.ఎన్. 07 సీఎం 2026. విజయ్‌ తమిళ వెట్రి కళగమ్‌ పార్టీ పెట్టిన కొద్ది రోజులకు 'గోట్‌' మూవీ విడుదలైంది. రాబోయే రోజుల్లో విజయ్‌ పార్టీనే విజయం సాధిస్తుందని, ఆయనే తమిళనాడు సీఎం అవుతారని వెంకట్ ప్రభు ఊహించారు. అందుకే ఆయన కారు నంబర్‌లో సీఎం 2026 అని వచ్చేలా పెట్టారు. ఫ్యూచర్‌ ను ముందే ఊహించిన వెంకట్ ప్రభును ఎన్నికల ఫలితాలు రాగానే అందరూ అభినందనలతో ముంచెత్తారు. దాంతో అదే నంబర్ ప్లేట్ ను ఫోటోగా ఫ్రేమ్‌ చేయించి, దానిని సీఎం విజయ్‌కు వెంకట్ ప్రభు గిఫ్ట్ గా అందించాడు. విజయ్‌ సైతం ఆనందంగా ఆ కానుకను స్వీకరించారు. సినిమా కథల విషయంలోనే కాదు... గిఫ్ట్స్‌ విషయంలోనూ వెంకట్ ప్రభు ఆలోచన భిన్నంగా ఉంటుందని సన్నిహితులు కితాబిస్తున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Chitrajyothy