Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
'విశ్వనాథ్ అండ్ సన్స్'.. ఆ వివాదానికి సూర్య చెక్ పెట్టనున్నారా

'విశ్వనాథ్ అండ్ సన్స్'.. ఆ వివాదానికి సూర్య చెక్ పెట్టనున్నారా

Chitrajyothy 2 weeks ago

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య (Suriya)కు తమిళంతో పాటు తెలుగు రాష్ట్రాల్లోనూ ఎంతటి భారీ ఫ్యాన్ బేస్ ఉందో తెలియంది కాదు. 'గజిని' సినిమా నుంచి రజనీకాంత్, కమల్ హాసన్ తర్వాత తెలుగు ప్రేక్షకులు సొంత కథానాయకుడిగా ఆదరించిన తమిళ స్టార్లలో సూర్య అగ్రస్థానంలో నిలిచారు.

అయితే, ఆ తర్వాత సరైన విజయాలు లేకపోవడంతో కొంత మార్కెట్ తగ్గినా.. ఇటీవల వచ్చిన 'కరుప్పు' (తెలుగులో 'వీరభద్రుడు') ఘన విజయంతో సూర్య మళ్లీ గ్రాండ్‌గా బాక్సాఫీస్ వద్ద కంబ్యాక్ ఇచ్చారు. ఈ సినిమా తెచ్చిపెట్టిన ఉత్సాహంతో ఆయన రాబోయే చిత్రం 'విశ్వనాథ్ అండ్ సన్స్'పై అంచనాలు భారీగా పెరిగాయి.

ఇటీవల ఈ సినిమా చుట్టూ ఒక వివాదం రాజుకున్న విషయం తెలిసిందే. ఈ చిత్ర దర్శకుడు వెంకీ అట్లూరి (Venky Atluri) తమిళ ప్రమోషనల్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 'విశ్వనాథ్ అండ్ సన్స్' (Vishwanath and Sons) సినిమా పూర్తిస్థాయి స్ట్రెయిట్ తమిళ చిత్రమని, దానిని తెలుగులోకి డబ్ చేస్తున్నామని స్పష్టం చేశారు. దర్శకుడు వెంకీ అట్లూరితో పాటు ఈ సినిమాను నిర్మిస్తోన్న నిర్మాత నాగవంశీ కూడా తెలుగు పరిశ్రమకు చెందినవారు కావడంతో, ఈ చిత్రాన్ని బైలింగువల్ (ద్విభాషా) లేదా స్ట్రెయిట్ తెలుగు సినిమాగా తీస్తారని భావించిన తెలుగు అభిమానులు.. ఈ వ్యాఖ్యలతో కొంత నిరాశకు గురయ్యారు. దీంతో సోషల్ మీడియాలో సైతం చిన్నపాటి చర్చ నడిచింది.

ఈ నేపథ్యంలో నెలకొన్న ఈ అసంతృప్తిని, వివాదాన్ని చక్కదిద్దేందుకు హీరో సూర్య స్వయంగా రంగంలోకి దిగనున్నారనేలా టాక్ నడుస్తోంది. హైదరాబాద్ వేదికగా జరిగే భారీ ప్రమోషనల్ ఈవెంట్లకు హాజరై, తెలుగు మీడియా, అభిమానులతో నేరుగా ముచ్చటించడం ద్వారా ఈ నెగెటివిటీకి చెక్ పెట్టాలని సూర్య అండ్ టీమ్ ప్లాన్ చేస్తున్నారట. తెలుగు ప్రేక్షకులతో తనకు ఉన్న సుదీర్ఘ అనుబంధాన్ని మరోసారి గుర్తుచేస్తూ సూర్య చేయబోయే ప్రమోషన్లు, సినిమా బిజినెస్‌కి మైలేజ్ ఇవ్వడమే కాకుండా, అభిమానుల్లో ఉన్న అపోహలను కూడా పూర్తిగా తొలగిస్తాయని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. చూద్దాం మరి.. సూర్య ప్లాన్ ఏ మేరకు వర్కవుట్ అవుతుందో..

ఇవి కూడా చదవండి:

'కొరియన్ కనకరాజు' టీమ్‌తో NSR స్పెషల్ ఇంటర్వ్యూ

NBK112: అందుకు నో.. కొరటాల ప్లాన్ మారింది

'సంత' చిత్రకళా పోటీకి ట్రెమండస్ రెస్పాన్స్.. దర్శకుడు హ్యాపీ!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Chitrajyothy