Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Vivek Agnihotri: మమతా బెనర్జీపై ఫైర్‌... వివేక్‌ వీడియో వైరల్‌..

Vivek Agnihotri: మమతా బెనర్జీపై ఫైర్‌... వివేక్‌ వీడియో వైరల్‌..

Chitrajyothy 3 weeks ago

మతా బెనర్జీపై (Mamata banerjee) దర్శకుడు వివేక్‌ (Vivek agnihotri) అగ్నిహోత్రి మండిపడ్డారు. తాను దర్శకత్వం వహించిన 'ది కశ్మీర్‌ ఫైల్స్‌' చిత్రాన్ని ఆమె అడ్డుకున్నారని, బెంగాల్‌లో అడుగుపెట్టనివ్వనని అన్నారని, ఆ తర్వాత బెంగాల్‌ నుంచి బహిష్కరించారని ఆయన అన్నారు.

తాజాగా జరిగిన ఎన్నికల్లో మమతా బెనర్జీకి పశ్చిమ బెంగాల్‌లో గట్టి షాక్‌ తగిలింది. ఎన్నికల ఫలితాల అనంతరం 'ఎవరికీ తెలియని కొన్ని విషయాలు' అంటూ వివేక్‌ అగ్నిహోత్రి వీడియో విడుదల చేశారు. ఆయన ఏం చెప్పారంటే 'ది కశ్మీర్‌ ఫైల్స్‌' విడుదలైన తర్వాత పశ్చిమబెంగాల్‌ నుంచి మమతా బెనర్జీ నన్ను పూర్తిగా బహిష్కరించారు. ఆ సినిమాను థియేటర్ల నుంచి తొలగించడమే కాకుండా.. నన్ను బెంగాల్‌లో అడుగుపెట్టనివ్వనని అన్నారు. అలాగే 'ది బెంగాల్‌ ఫైల్స్‌' చిత్రాన్ని ఆమె పశ్చిమబెంగాల్‌లో పూర్తిగా నిషేదించారు. ట్రైలర్‌ లాంచ్‌ను అడ్డుకున్నారు. ఇకపై ఇలాంటివి జరగకూడదు' అని అన్నారు.

రహస్యంగా సినిమా చూపించాం...

'మాపై ఎన్నో దాడులు చేశారు. నాపై డజన్ల కొద్దీ ఎఫ్‌ఐఆర్‌ నమోదయ్యాయి. నన్ను బెంగాల్‌లో ఏ కార్యక్రమానికి పిలవకుండా చేశారు. చివరకు గవర్నర్‌ నుంచి అవార్డు తీసుకోవడానికి కూడా నేను వెళ్లలేకపోయాను. అయినా.. మేం వెనకడుగు వేయలేదు. ఈ ఎన్నికల సమయంలో 'ది బెంగాల్‌ ఫైల్స్‌' చిత్రాన్ని బెంగాల్‌ వ్యాప్తంగా సాధ్యమైనంత ఎక్కువమందికి రహస్యంగా చూపించాం. మా శక్తి మేరకు పోరాడినందుకు నాకు సంతోషంగా ఉంది. మా కష్టానికి తగ్గ ఫలం దక్కింది. గొప్ప విజయం వరించింది' అని వివేక్‌ ఆ వీడియోలో పేర్కొన్నారు. ఇకపై బెంగాల్‌ ప్రజలు ఎలాంటి భయం లేకుండా తలెత్తి గర్వంగా నడవొచ్చు' అని అన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Chitrajyothy