Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
యాక్షన్‌ కింగ్‌ అర్జున్‌ 'బ్లాస్ట్‌' చేసేది ఆ రోజే!

యాక్షన్‌ కింగ్‌ అర్జున్‌ 'బ్లాస్ట్‌' చేసేది ఆ రోజే!

Chitrajyothy 4 days ago

'యాక్షన్‌ కింగ్‌' అర్జున్‌ (Action King Arjun) హీరోగా నటించిన కొత్త చిత్రం 'బ్లాస్ట్‌' (Blast). ఈ చిత్రం ద్వారా సుభాష్‌ కె.

రాజ్‌ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఇందులో అర్జున్‌ సరసన అభిరామి (Abhirami) నటించారు. ఇతర పాత్రలను జాన్‌ కొక్కన్‌, అర్జున్‌ చిదంబరం, పవన్‌, బాల హాసన్‌, వినోద్‌సాగర్‌ తదితరులు పోషించారు. అర్జున్‌ - అభిరామి కాంబినేషన్‌లో 20 యేళ్ల క్రితం 'వానవిల్‌' వచ్చింది. రెండు దశాబ్దాల తర్వాత వీరిద్దరూ వెండితెరను షేర్‌ చేసుకున్నారు. వీరి కుమార్తెగా ప్రీతి ముకుందన్‌ నటించారు. ప్రముఖ నిర్మాణ సంస్థ ఎజీఎస్‌ ఎంటర్‌టైన్మెంట్‌ నిర్మించగా, 'కేజీఎఫ్‌' ఫేం రవి బస్రూర్‌ సంగీతం అందించారు. ఈనెల 28న ఈ చిత్రం విడుదల కాబోతున్నట్లుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఫ్యామిలీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందించిన ఈ చిత్రానికి కల్పాతి ఎస్‌.అగోరం, కల్పాత్తి ఎస్‌.గణేష్‌, కల్పాత్తి ఎస్‌.సురేష్‌ నిర్మాతలు. ఈ చిత్రం విడుదలను పురస్కరించుకుని ఈనెల 18న ఆడియో, ట్రైలర్‌ను రిలీజ్‌ చేశారు.

ఈ సందర్భంగా అర్జున్‌ మాట్లాడుతూ.. అపూర్వమైన విజయంతో విజేతల జాబితాలో చేరిన నా స్నేహితుడు, సీఎం విజయ్‌కు నా హృదయపూర్వక అభినందనలు. 'బ్లాస్ట్‌' సినిమా నిజంగానే ఒక బ్లాస్ట్‌. నేను చాలా సినిమాల్లో నటించినప్పటికీ కరాటే మాస్టర్‌ పాత్రను పోషించడం ఇదే. ప్రతి దర్శకుడికి ఆత్మవిశ్వాసం ముఖ్యం. సుభాష్‌లో అది పుష్కలంగా ఉంది. ఏజీఎస్‌ నిర్మాణ సంస్థలో పనిచేయడం ఇదే తొలిసారి. వారి వృత్తి నైపుణ్యం, విధానం, ప్రతీది చాలా గొప్పగా ఉంది. చాలా యేళ్ల తర్వాత అభిరామితో కలిసి నటించడం సంతోషంగా ఉంది. ఆమె ఒక నటిగా ఎన్నో గొప్ప విజయాలు సాధించారు. ఆమె ఒక నటి మాత్రమే కాదు. గాయని కూడా. సందేశాత్మక చిత్రంలో నటించినందుకు సంతోషంగా ఉందని అన్నారు.

చిత్ర దర్శకుడు సుభాష్‌ మాట్లాడుతూ.. 'ఇది యాక్షన్‌ చిత్రం. కానీ, కుటుంబంతో కలిసి చూడదగిన సినిమా. ఈ సినిమా చూసినప్పుడు తల్లిదండ్రులందరూ కనెక్ట్‌ అవుతారు. సమాజానికి అవసరమైన ఎన్నో విషయాలను ప్రచారంలా కాకుండా కథతో పాటు ఆసక్తికరంగా చెప్పాం. ప్రతి ఒక్కరూ చూసి ఎంజాయ్‌ చేస్తారు' అని పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి:

నిద్రపోతున్న సింహాన్ని లేపొద్దు: జయం రవికి భార్య ఆర్తి కౌంటర్!

కోహ్లీ కుస్తీ ఆడితే ఎలా ఉంటదో.. 'పెద్ది' ట్రైలర్‌పై నాగవంశీ

మేము అమ్మ, నాన్నలమయ్యాం: జబర్దస్త్ నటుడు ఎమోషనల్!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Chitrajyothy