Sunday, 24 Jan, 11.57 am చిత్రం భళారే

హోమ్
వరల్డ్ డిజిటల్ ప్రీమియర్ : ఈ నెల 29 న ఆహా లో 'క్రాక్' సినిమా

krack-movie-streaming-on-aha-in-this-month-29th

మాస్ మహరాజ లేటెస్ట్ సినిమా క్రాక్. సంక్రాంతి సందర్భంగా విడుదలైన ఈ సినిమా సంక్రాంతి విజేతగా నిలిచింది. జనవరీ9న విడుదలైన ఈ సినిమా ఇప్పటికీ బాక్సాఫీస్ వద్ద వసూళ్లు చేస్తూనే ఉంది. అయితే ఈ సినిమా స్ట్రీమింగ్ రైట్స్‌ను తెలుగు ఓటీటీ సంస్థ ఆహా కొనుగోలు చేసిందన్న విషయం పక్కా అయింది. ఇప్పటికే తన టార్గెట్ అందుకున్న ఈ సినిమా వరల్డ్ డిజిటల్ ప్రీమియర్ ఆహా లో స్ట్రీమింగ్ చేయబోతున్నారు.

ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులు 8 కోట్లు కు కొనుగోలు చేసిన ఆహా చిత్రాన్ని జనవరి 29 న తన యాప్‌లో స్ట్రీమింగ్ చేయబోతుంది . ఈ చిత్రం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కింది. ఈ సినిమాతో శ్రుతిహాసన్ చిత్ర సీమలోకి రీఎంట్రీ ఇచ్చింది. ఇందులో ప్రముఖ దర్శకుడు సముద్రఖని విలన్ పాత్రను పోషించాడు. ప్రస్తుతం సంక్రాంతికి విడులైన సినిమాల్లో అత్యదిక వసూళ్లు చేసిని సినిమాగా నిలిచింది. ఈ సినిమా అభిమానుల అంచనాలను మించి అలరించింది.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Chitrambhalare Telugu
Top