Monday, 09 Nov, 7.40 pm CINEMA POLITICS

తెలుగు
హనీమూన్ ఎంజాయ్ చేస్తున్న కాజల్ కిచ్లు

అందాల చందమామ కాజల్ అగర్వాల్ అక్టోబర్ 30న వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. కాజల్ తన చిన్ననాటి స్నేహితుడు గౌతమ్ కిచ్లు ను పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకుంది. కరోనా నేపథ్యంలో అతికొద్దిమంది అతిథుల సమక్షంలో ముంబైలో కాజల్ వివాహ వేడుక జరిగింది. ఇక పెళ్లి తరవాత కాజల్ కిచ్లు జంట హనీమూన్ కు పయనమయ్యారు. కొనరాడ్ మాల్దీవుల్లో కాజల్ గౌతమ్ లు ఎంజాయ్ చేస్తున్నారు. తాజాగా కాజల్ తన భర్త గౌతమ్ కలిసి ఉన్న ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ అవుతోంది. ఫొటోలో కాజల్ రెడ్ కలర్ డ్రెస్ లో క్యాప్ ధరించి మెరిసిపోతుంది. కాజల్ ను కిచ్లు వెనక నుండి పట్టుకుని ఫొటోకు ఫోస్ ఇచ్చాడు.

ఇక హనీమూన్ తరవాత కాజల్ ఆచార్య షూటింగ్ లో పాల్గొననుంది. సినిమాల విషయానికొస్తే కాజల్ ప్రస్తుతం ఆచార్య తో పాటు "ముంబై సాగా" అనే హిందీ సినిమాలో కూడా నటిస్తోంది. మరోవైపు కమల్ హాసన్ హీరోగా నటిస్తున్న "ఇండియన్ 2" సినిమాలోనూ కీలక పాత్ర పోషిస్తుంది. ఈ సినిమాకు శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. మరోవైపు ఓ ఇంటర్ నేషనల్ వెబ్ సిరీస్ లో కూడా కాజల్ నటిస్తున్నట్టు తెలుస్తోంది. నెట్ ఫ్లిక్స్ ఈ వెబ్ సిరీస్ ను నిమిస్తుందట. అంతే కాకుండా తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు తెరకెక్కిస్తున్న మరో వెబ్ సిరీస్ లోను కాజల్ నటిస్తోంది. ఇక ఇన్ని ఆఫర్లు చేతిలో ఉన్న కాజల్ పెళ్లి తరవాత సినీ ప్రస్థానం ఎలా ఉంటుందో చూడాలి.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Cinema Politics Telugu
Top