తెలుగు
మోటార్ బోట్ దెబ్బకు ట్విట్టర్ నుంచి బ్రహ్మాజీ ఔట్..

కొన్నిసార్లు మనం సరదాకు చేసినవి కూడా చాలా సీరియస్ అవుతుంటాయి. ఇప్పుడు నటుడు బ్రహ్మాజీ విషయంలో కూడా ఇదే జరిగింది. హైదరాబాద్ వర్షాలపై ఈయన వేసిన సెటైర్ చాలా సీరియస్ అయింది. కామెడీ కోసం చేసానని అనుకున్నాడు కానీ అది కాస్తా రచ్చ రచ్చ అయింది. ఓ విధంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈయన ట్వీట్ చేసాడంటూ రచ్చ చేసారు. దాంతో ఈయన ఏకంగా ట్విట్టర్ నుంచి బయటికి రావాల్సిన పరిస్థితి వచ్చింది. అసలు విషయం ఏంటంటే కొన్నిరోజులుగా హైదరాబాద్లో కురుస్తున్న వర్షాల కారణంగా తన ఇంట్లోకి వరదనీరు చేరిందని పేర్కొంటూ ఇటీవల ఆయన ట్వీట్ చేసాడు. అందులో బయటికి కూడా రాలేని పరిస్థితి ఉంది.
దాంతో ఈయన కాస్త వ్యగ్యంగా సెటైర్ వేసాడు. 'మోటర్ బోట్ కొనాలనుకుంటున్నా.. ఏది బాగుంటుందో సలహా ఇవ్వండి' అంటూ ఆయన ఓ ట్వీట్ చేసాడు. అది చాలా వైరల్ అయింది.
కొందరు దానిపై పాజిటివ్ గా స్పందించారు కానీ మరికొందరు మాత్రం దాన్ని చాలా సీరియస్ చేసారు. వర్షాల కారణంగా అందరూ ఇబ్బందులు పడుతుంటే వ్యంగ్యంగా ట్వీట్లు చేస్తారా అంటూ కొందరు నెటిజన్లు సెటైర్లు వేసారు. అంతేకాదు ప్రభుత్వం తరఫు నుంచి కూడా ఈయనకు కొన్ని వార్నింగులు వచ్చినట్లు ప్రచారం జరుగుతుంది. దాంతో ఆయన తన ట్విటర్ ఖాతాని డియాక్టివేట్ చేసాడు. 2011లో ట్విటర్లోకి వచ్చిన బ్రహ్మాజీ తొమ్మిదేళ్ల జర్నీకి ఫుల్ స్టాప్ పెట్టాడు.