తెలుగు
RRRషూటింగ్ నుండి సడన్ గా వెళ్లిపోయిన చరణ్

కరోనా మహమ్మారి రోజు రోజుకు విజృంభిస్తోంది. కేసుల సంఖ్య మళ్ళీ పెరుగుతోంది. సాధారణ ప్రజలతో పాటు సెలబ్రెటీలు సైతం కరోనా భారిన పడటం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా మెగాస్టార్ చిరంజీవి కరోనా భారిన పడ్డారు. ఆచార్య సినిమా షూటింగ్ మొదలు పెట్టె ముందు ఆయన కరోనా టెస్ట్ చేయించుకున్నారు. కాగా ఆయనకు రిపోర్ట్స్ లో పాజిటివ్ వచ్చింది. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియాలో వెల్లడించారు. అయితే తనకు ఎలాంటి లక్షణాలు లేవని..తనను కలిసిన వారంతా హోమ్ ఐసోలేషన్ లో ఉండాలని పేర్కొన్నారు. తన ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు వివరిస్తానని ఆయన వెల్లడించారు.
కాగా మెగాస్టార్ కు కరోనా వచ్చిందన్న విషయం తెలియగానే రాంచరణ్ ఆర్ఆర్ఆర్ షూటింగ్ ను నుండి హడావుడిగా వెళ్లినట్టు సమాచారం. ఇటీవలే రాంచరణ్ తండ్రి చిరు తో కలిసి మొక్కలు కూడా నాటారు. మెగాస్టార్ కు కరోనా పాజిటివ్ రావడంతో ఆయన అభిమానులు ఆందోళలన చెందుతున్నారు. తమ అభిమాన హీరో త్వరగా కోలుకోవాలని ప్రార్ధనలు చేస్తున్నారు. మరోవైపు సెలబ్రెటీ ప్రముఖులు సైతం మెగాస్టార్ త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఇప్పటికే నాగబాబు, ఉపాసన తదితరులు మెగాస్టార్ త్వరగా కోలుకోవాలని ట్వీట్స్ చేశారు.