Saturday, 07 Nov, 5.40 pm CINEMA POLITICS

తెలుగు
స్నేహితుడి ప్రైవెట్ ఫ్లైట్‌లో ప్రభాస్ ఉరుకులు పరుగులు..

ప్రభాస్ ప్రస్తుతం బిజీగా ఉన్నాడు. ఈయన రాధే శ్యామ్ తో పాటు మరో రెండు మూడు సినిమాలకు కూడా కమిటయ్యాడు ఇప్పుడు. అందులో త్వరలోనే ఔం రౌత్ తెరకెక్కించబోయే ఆదిపురుష్ షూటింగ్ మొదలు కానుంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితులను బట్టి బయట తిరగడం అంత మంచిది కాదు. పైగా ఎయిర్ పోర్టుకు వెళ్లడం.. అక్కడ ఫ్లైట్స్ జర్నీ చేయడం కూడా అంత శ్రేయస్కరం కాదు. ఎందుకంటే కరోనా వైరస్ సెకండ్ వేవ్ కూడా వచ్చేస్తుందంటూ వార్తలు వస్తున్నాయి. పైగా ఇతర దేశాల్లో అయితే పరిస్థితులు చేదాటిపోతున్నాయి. దాంతో హీరోలు మరింత జాగ్రత్తగా ఉంటున్నారు. మొన్నటి వరకు కూడా ఇటలీలో షూటింగ్ చేసొచ్చాడు ప్రభాస్. దాంతో ఫ్యాన్స్ ఒకింత కంగారు పడుతున్నారు కూడా. అయితే అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు కాబట్టి ఎలాంటి ప్రమాదం లేదు.

ఇదిలా ఉంటే ఇప్పుడు తన సినిమాల కోసం ప్రభాస్ తన స్నేహితుడిని వాడుకుంటున్నాడు. తన NRI ఫ్రెండ్‌ను అడిగి అతడి ఛాటర్ ఫ్లైట్ తన కోసం వాడుకుంటున్నాడు. అందులోనే ప్రయాణిస్తున్నాడు ప్రభాస్. జనంతో కలిస్తే కచ్చితంగా కరోనా వ్యాప్తి చెందుతుందని భావించిన ప్రభాస్.. తన స్నేహితుడి ఫ్లైట్ తీసుకున్నాడు. అందులోనే ఇటలీ నుంచి హైదరాబాద్ వచ్చాడు. ఇప్పుడు మళ్లీ హైదరాబాద్ నుంచి ముంబైకి కూడా ఈ ఛాటర్ ఫ్లైట్ లోనే వెళ్లాడు ప్రభాస్. ఆదిపురుష్ మీటింగ్ కోసం ముంబైకి అదే ఫ్లైట్ లో వెళ్లొచ్చాడు ప్రభాస్. ఇకపై కూడా స్నేహితుడి ఫ్లైట్ తన దగ్గరే పెట్టుకోనున్నాడు ఈ హీరో.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Cinema Politics Telugu
Top