Thursday, 01 Oct, 6.47 pm DAY 2 DAY NEWS

ప్రధాన వార్తలు
హైదరాబాద్ లో హైటెన్షన్. రేవంత్ రెడ్డి అరెస్ట్.

హత్రాస్ లో రాహుల్ గాంధీ అరెస్ట్ తరువాత హైదరాబాద్ లో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గాంధీభవన్ నుంచి నాంపల్లి వైపు దూసుకు వచ్చారు. కాంగ్రెస్ కార్యకర్తలు, రేవంత్ రెడ్డిలు బీజేపీ వైపుకు వస్తున్నారని తెలుసుకున్న బీజేపీ కార్యకర్తలు భారీ సంఖ్యలో పార్టీ ఆఫీస్ వద్దకు చేరుకున్నారు. కాంగ్రెస్ కార్యకర్తలకు, బీజేపీ కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది.

నాంపల్లి ఏరియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో భారీ సంఖ్యలో పోలీసులు మోహరించారు. రేవంత్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసి బేగంబజార్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ప్రస్తుతం అక్కడి పరిస్థితి ఉద్రిక్తకరంగా మారింది. పోలీసులు కాంగ్రెస్ నేతలను అడ్డుకోవడంతో పోలీసులు జులుం నశించాలని కాంగ్రెస్ నేతలు నినాదాలు చేశారు.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: DAY 2 DAY NEWS
Top