Tuesday, 01 Dec, 10.36 am Digit

న్యూస్ & లాంచెస్
FAU-G గూగుల్ ప్లే స్టోర్‌లో ప్రీ-రిజిస్ట్రేషన్ కోసం సిద్ధం

FAU-G: ఫియర్లెస్ మరియు యునైటెడ్ గార్డ్స్ గేమ్ కోసం ప్రీ-రిజిస్ట్రేషన్లను తెరిచినట్లు కోర్ గేమ్ ప్రకటించింది. ఆసక్తి ఉన్నవారు గూగుల్ ప్లే స్టోర్లో ఆట కోసం ముందే నమోదు చేసుకోవచ్చు. ఆట యొక్క హైప్ ను సొమ్ము చేసుకునేందుకు చూస్తున్న అన్ని నకిలీ FAU-G క్లోన్లను గూగుల్ సమర్థవంతంగా ప్రక్షాళన చేసిన కొద్ది రోజులకే ఈ ప్రకటన వెలువడింది.

ఇక ఈ భారతీయ గేమ్ గురించి గుర్తుకుచేసుకుంటే , ఈ ఆటను బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ ప్రకటించారు. డెవలపర్లు అక్టోబర్లో ట్రైలర్ను విడుదల చేశారు, అక్కడ నవంబర్ చివరి నాటికి ఆటను ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. డౌన్లోడ్ కోసం ఆట ఎప్పుడు అందుబాటులోకి వస్తుందో ఇంకా తెలియదు. ప్రీ-రిజిస్టర్ ఎంచుకున్న వారు ఆట డౌన్లోడ్ కోసం ఎప్పుడు అందుబాటులో ఉంటుందో తెలియజేయడానికి ఎంచుకోవచ్చు లేదా ఆట అందుబాటులోకి వచ్చిన వెంటనే ఆటొమ్యాటిగ్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు.

గూగుల్ ప్లే స్టోర్లో ఈ గేమ్ యొక్క రూపం ఆట గురించి మరింత లోతుగా అర్థం చేసుకునేలా చేస్తుంది. ఇందులో గేమ్ యొక్క వివరణ, దాని వయస్సు రేటింగ్ మరియు స్క్రీన్ షాట్ ఉన్నాయి, ఇది ఆట యొక్క ప్రధాన మెనూను చూపిస్తుంది.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Digit Telugu
Top