Posts
వింత.. లక్షణాలు లేకపోయినా 31 సార్లు కరోనా పాజిటివ్ !

భారత్ తో పాటు ప్రపంచ దేశాలన్నింటినీ గడగడలాడించింది కరోనా మహమ్మారి. అసలు దాని పేరు తలచుకుంటేనే ఇప్పటికీ హడలిపోతున్నారు ప్రజలు. అందులోనూ 2020 అంత చెడ్డ సంవత్సరం ఏదీ లేదని, ఇకముందు అలాంటి సంవత్సరం రాకూడదని కోరుకుంటున్నారు. కాగా.. కరోనాలోనే ఒక వింత ఘటన వెలుగుచూసింది. ఒక మహిళకు కరోనా లక్షణాలు లేకపోయినప్పటికీ టెస్ట్ చేసిన ప్రతీసారి పాజిటివ్ అనే వస్తుందట. అలా ఒకసారి కాదు.. రెండుసార్లు కాదు.. ఏకంగా 31 సార్లు పాజిటివ్ రావడం చూసి డాక్టర్లే షాకయ్యారు.
వివరాల్లోకి వెళ్తే రాజస్థాన్ లోని అప్నాఘర్ ఆశ్రమానికి చెందిన శారదకు కరోనా లక్షణాలేవీ లేవు. అయినా గతేడాది ఆగస్టు 20వ తేదీన కరోనా పరీక్ష చేయగా పాజిటివ్ అని వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటి వరకూ ఆమెకు 31 సార్లు వైద్యపరీక్షలు చేయగా ప్రతీసారి పాజిటివ్ అనే వచ్చినట్లువైద్యుడు భరద్వాజ్ తెలిపాడు. కానీతొలిసారి పాజిటివ్ వచ్చినప్పటి కన్నా ఇప్పుడు ఆమె సంపూర్ణ ఆరోగ్యంతో ఉండటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. పైగా శారద 7 నుంచి 8 కిలోల బరువు పెరిగిందట. ఆమె కడుపు భాగంలో కరోనా నమూనాలు ఉండటం వల్ల ఇలా జరుగుతుండవచ్చని వైద్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. శారద నుంచి కొన్ని నమూనాలను సేకరించిన వైద్యులు, శాస్త్రవేత్తలు అధ్యయనం చేస్తున్నారు.
related stories
-
రాష్ట్రీయం చెత్త కుప్పలో నవజాత శిశువు
-
తాజావార్తలు చెట్ల పొదల్లో పసికందు
-
తెలంగాణ తాజావార్తలు డీహెచ్ గడల శ్రీనివాసరావు గుండెకు స్టెంట్