Monday, 10 May, 4.25 am ఈనాడు

కృష్ణ
1240 పాజిటివ్‌ కేసుల నమోదు

విజయవాడ వైద్యం, న్యూస్‌టుడే: జిల్లాలో గడిచిన రెండు రోజులుగా రికార్డు స్థాయిలో కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. ఆదివారం 1240 మందికి వైరస్‌ సోకగా, ఐదుగురు మృతిచెందారు. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 69,958కి చేరింది. 8,932 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. 60,212 మంది వైరస్‌ను జయించి డిశ్ఛార్జి అయ్యారు. ఇప్పటివరకు వరకు మొత్తం 814 మంది మృతిచెందారు.

బందరు డివిజన్‌లో 414 ..

మచిలీపట్నం (గొడుగుపేట), న్యూస్‌టుడే: బందరు డివిజన్‌లో ఆదివారం అత్యధికంగా 414 కొవిడ్‌ కేసులు నమోదైనట్లు ఆర్డీవో ఖాజావలి తెలిపారు. మచిలీపట్నంలోని వివిధ ప్రాంతాల్లో 189 కేసులు రాగా, పెడన పట్టణంలో ఒక కేసు నమోదయ్యింది. డివిజన్‌లోని పలు గ్రామాల్లో 224 కేసులు నమోదయ్యాయని చెప్పారు. అధికంగా బందరు నగరంలోని బలరామునిపేటలో 18, మాచవరం 9, ఈడేపల్లి 27, చిలకలపూడి 15, బంటుమిల్లి మండలం మణేశ్వరంలో 8, కోడూరులో 18 కేసులు వచ్చాయన్నారు. ప్రజలంతా నిబంధనలు పాటిస్తూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని కోరారు.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Eenadu
Top