Sunday, 07 Mar, 5.50 am ఈనాడు

తమిళనాడు
2 గంటలు... 23 కి.మీ. పరుగు

ప్రతిభ చాటిన తొమ్మిదేళ్ల బాలిక


పరుగు తీస్తున్న వర్షిహా

చెన్నై, న్యూస్‌టుడే: తొమ్మిదేళ్ల ఓ చిన్నారి 2 గంటల్లో 23 కిలోమీటర్ల దూరం పరుగెత్తి ఆకట్టుకుంది. తంజావూర్‌ జిల్లా చెంగపడుతాన్‌కాడు గ్రామానికి చెందిన మారిముత్తు, మాల దంపతుల కుమార్తె వర్షిహా (9) అలివలం గ్రామంలోని ఓ ప్రైవేటు మెట్రిక్యులేషన్‌ పాఠశాలలో 4వ తరగతి చదువుతోంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం, ఓటుహక్కుపై అవగాహన కల్పిస్తూ ఈ పరుగుకు శ్రీకారం చుట్టింది. వర్షిహాను పట్టుకోట్టై సబ్‌ కలెక్టరు బాలచందర్‌, మున్సిపల్‌ కమిషనరు చెన్ను కృష్ణన్‌ అభినందించారు.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Eenadu
Top