43 మందికి తెలుగువర్సిటీ కీర్తి పురస్కారాలు

Saturday, 13 Oct, 5.42 am
నారాయణగూడ, న్యూస్‌టుడే: తెలుగు సాహిత్యంలోని వివిధ ప్రక్రియల్లో విశేష సేవలందించిన 43 మంది ప్రముఖులకు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 2017 ఏడాదికి 'కీర్తి పురస్కారాలు' ప్రకటించింది. వర్సిటీ ఉపకులపతి ఆచార్య ఎస్వీ సత్యనారాయణ అధ్యక్షతన ఏర్పాటైన నిపుణుల సంఘం ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రముఖులు పురస్కారాలకు ఎంపిక చేసింది. పురస్కారాలకు ఎంపికైన వారిలో ఆర్‌.ఎస్‌.ప్రవీణ్‌కుమార్‌ (వయోజన విద్య, నిరంతర విద్య, వ్యక్తిత్వ వికాసం), కె.సర్వోత్తమరావు (భాషా స్వచ్ఛంద సాహిత్య విమర్శ), ఎం.నారాయణశర్మ (సాహిత్య విమర్శ), ఉప్పల నరసింహం (కథ), డా.జి.ఎస్‌.ప్రసాదరెడ్డి (నాటక రంగం), ఎం.వి.రమణారెడ్డి (జనరంజక విజ్ఞానం), వి.పి.చందన్‌రావు (కాల్పనిక సాహిత్యం), ఐ.అన్నె మృదుల నాన్సీ (ఉత్తమ ఉపాధ్యాయురాలు), బైస దేవదాసు (పత్రికా రచన), హెచ్‌.రమేశ్‌బాబు (జీవిత చరిత్ర), ఎం.శంకరరావు-బాలి (కార్టూనిస్ట్‌), కందేపి రాణి ప్రసాద్‌ (ఉత్తమ రచయిత్రి), సబ్బని లక్ష్మీనారాయణ (వచన కవిత), యెల్ది సుదర్శన్‌ (సృజనాత్మక సాహిత్యం), గనిశెట్టి రాములు (పరిశోధన), భీమరాజు వెంకటరమణ (హాస్యరచన), జయవాణి (ఉత్తమనటి), రొట్టె విశ్వనాథం (ఉత్తమ నటుడు), భారతుల రామకృష్ణ (ఉత్తమ నాటక రచయిత), కన్నెబోయిన అంజయ్య (హేతువాద ప్రచారం), కొలకలూరి స్వరూపారాణి (ఉత్తమ రచయిత్రి), అల్లూరి గౌరీశంకర్‌ (వివిధ ప్రక్రియలు), బెజుగామ రామమూర్తి (అవధానం), మల్లు స్వరాజ్యం (మహిళాభ్యుదయం), లంక సూర్యనారాయణ (గ్రంథాలయకర్త), ఖాజా పద్మిని (గ్రంథాలయ సమాచార విజ్ఞానం), కవిత కొండ (ఆంధ్ర నాట్యం), కాశీభట్ల వేణుగోపాల్‌ (నవల), పిల్లుట్ల ప్రకాశ్‌ (జానపదకళలు), కస్తూరి మురళీకృష్ణ (ఆధ్యాత్మిక సాహిత్యం), అమ్మన చంద్రారెడ్డి (పద్యం), అళ్లూరి వెంకటయ్య (సాంస్కృతిక సంస్థ నిర్వహణ), స్నేహలతా మురళీ (జానపద గాయకులు), బెలగాం భీమేశ్వరరావు (బాలసాహిత్యం), బి.ఎన్‌.ఎస్‌.కుమార్‌ (ఇంద్రజాలం), గండ్ర లక్ష్మణరావు (పద్యరచన), కలగా కృష్ణమోహన్‌ (లలిత సంగీతం), కె.శేషుబాబు (శాస్త్రీయ సంగీతం), ఆచార్య డి.ఎల్‌.ఎన్‌.మూర్తి (జ్యోతిషం), సురారం శంకర్‌ (గేయం), డా.రమాదేవి (కూచిపూడి నృత్యం), డా.సిహెచ్‌ హరనాథ్‌ (ప్రాచీన సాహిత్యం), ఎలనాగ (అనువాద సాహిత్యం) లకు పురస్కారాలు ప్రకటించారు.