తమిళనాడు
5 వేల దిగువకు యాక్టివ్ కేసులు

రోజు వ్యవధిలో చెన్నైలో నమోదు కాని మరణాలు
రాష్ట్రంలో మొత్తం బాధితుల సంఖ్య 8,34,740
చెన్నై, న్యూస్‌టుడే: రాష్ట్రంలోని మొత్తం కరోనా యాక్టివ్ కేసులు 5 వేల లోపునకు చేరుకున్నాయి. రోజు వ్యవధిలో ఆదివారం కొత్తగా 569 పాజిటివ్ కేసులు, ఏడు మరణాలు నమోదయ్యాయి. మృతుల్లో కోయంబత్తూర్‌లో ఇద్దరు, చెంగల్పట్టు, కాంచీపురం, మదురై, తిరువళ్ళూర్, తిరుప్పూర్‌లో ఒకరి చొప్పున ఉన్నారు. చెన్నైలో కొత్తగా కరోనా మరణాలు నమోదు కాలేదు. దీంతో నగరంలోని మొత్తం మరణాల సంఖ్య 4,085గానే ఉంది. నగరంలో 225 మంది డిశ్చార్జికాగా ఇంకా 1,693 మంది ఆస్పత్రులు, ఇళ్లల్లో చికిత్స పొందుతున్నారు. రాష్ట్ర ఆరోగ్యశాఖ వెల్లడించిన వివరాల మేరకు.. రాష్ట్రంలోని కొత్త కేసుల్లో 566 కేసులు రాష్ట్రంలోని వ్యక్తులకు, మిగతా వ΄డు కేసులు రోడ్డు మార్గంగా కర్ణాటక నుంచి తిరిగి వచ్చినవారికి నిర్వహించిన పరీక్షల్లో నిర్ధారణయ్యాయి. జిల్లాల వారీగా అత్యధికంగా చెన్నైలో 168 కేసులు ఉన్నాయి. తర్వాతి స్థానాల్లో కోయంబత్తూర్ (55), చెంగల్పట్టు (40), తిరుప్పూర్ (36), ఈరోడు (29), కాంచీపురం (23), తిరువళ్ళూర్ (22), సేలం (19), కన్యాకుమారి (17), తిరుచ్చి (17), వేలూర్ (15), నామక్కల్ (13), తంజావూర్ (13), మదురై (10), రాణిపేట (10), నీలగిరి (9), తూత్తుకుడి (9), నాగపట్నం (8), తిరునెల్వేలి (6), కడలూర్ (5), కృష్ణగిరి (5), శివగంగై (5), విరుదునగర్ (5), దిండుగల్ (4), తేని (4), తిరుపత్తూర్ (4), తిరువారూర్ (4), కరూర్ (3), పుదుకోట్టై (3), ధర్మపురి (2), తెన్కాశి (2), విళుపురం (2), రామనాథపురం (1), తిరువణ్ణామలై (1) జిల్లాలు ఉన్నాయి. అరియలూర్, కళ్లకురిచ్చి, పెరంబలూర్ జిల్లాల్లో కొత్త కేసులు నమోదుకాలేదు.
పుదుచ్చేరిలో మరో 30 కేసులు
పుదుచ్చేరిలో రోజు వ్యవధిలో ఆదివారం మరో 30 కరోనా కేసులు నమోదయ్యాయి. 3,046 నవ΄నాలు పరీక్షించగా ఈ కేసులు బయటపడ్డాయి. ఇందులో పుదుచ్చేరిలో 15, కారైకాల్‌లో 6, మాహేలో 9 చొప్పున కేసులు ఉన్నాయి. యానాంలో కొత్త కేసులు నమోదు కాలేదు. దీంతో పుదుచ్చేరిలోని మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 38,860కి చేరింది. కరోనా రోగుల్లో ఒకరు మరణించడంతో మొత్తం మృతుల సంఖ్య 645కి పెరిగింది. మరో 43 మంది డిశ్చార్జికావడంతో కోలుకున్నవారి సంఖ్య 37,927కి చేరింది. ఇంకా 288 మంది చికిత్సల్లో ఉండగా అందులో 100 మంది ఆస్పత్రులు, 188 మంది హోం క్వారంటైన్లో ఉన్నారని పుదుచ్చేరి ఆరోగ్యశాఖ కార్యదర్శి అరుణ్ వెల్లడించారు. కోలుకున్నవారి శాతం 97.60గా, మృతుల శాతం 1.66గా ఉందని తెలిపారు. ఇప్పటివరకు 5,57,189 నవ΄నాలు పరీక్షించగా అందులో 5,13,820 నవ΄నాల్లో ఫలితాలు నెగెటివ్‌గా వచ్చాయని పేర్కొన్నారు.
related stories
-
హోం CoronaVirus: తెలంగాణలో తొలి కరోనా కేసు నమోదై నేటికి ఏడాది పూర్తి
-
జాతీయం-అంతర్జాతీయం రాజధానిలో నెలన్నర తరువాత అత్యధిక కరోనా కేసులు నమోదు!
-
తాజా వార్తలు అండమాన్, అస్సాంలో భూప్రకంపనలు