Friday, 02 Oct, 4.07 am ఈనాడు

జాతీయ- అంతర్జాతీయ వార్తలు
60,539 మందికి రెండో విడత దోస్త్‌ సీట్లు

ఈనాడు, హైదరాబాద్‌: దోస్త్‌ రెండో విడతలో కొత్తగా గురువారం 60,539 మందికి సీట్లు కేటాయించారు. మొదటి విడతలో సీట్లు పొంది రెండో విడతలో వెబ్‌ ఆప్షన్లు ఇచ్చుకున్న వారిలో 5,180 మందికి మెరుగైన సీట్లు లభించాయి. రెండో విడత వరకు చూస్తే.. రాష్ట్రంలోని మొత్తం 986 డిగ్రీ కళాశాలల్లో 4,09,450 సీట్లు ఉండగా ఇంకా 2,41,266 సీట్లు ఖాళీగా ఉన్నాయి. 123 ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో 69,660 సీట్లు ఉంటే మొదటి విడతలో 26,439 మంది సీట్లు నిర్ధరించుకున్నారు. రెండో విడతలో 19,309 మందికి సీట్లు దక్కాయి.. మూడో విడత ప్రవేశాల కోసం ఈ నెల 5వ తేదీ వరకు రిజిస్ట్రేషన్‌, 6వ తేదీ వరకు వెబ్‌ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చని ఆయన తెలిపారు.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Eenadu
Top