తాజా వార్తలు
'60శాతం తల్లిదండ్రులు అంగీకార పత్రాలిచ్చారు'

పాఠశాలల పునఃప్రారంభంపై మంత్రి సబితా సమీక్ష
హైదరాబాద్: ఫిబ్రవరి 1నుంచి పాఠశాలలు ప్రారంభం కానున్న నేపథ్యంలో 9, 10వ తరగతులకు విద్యార్థులను పంపించేందుకు 60శాతం మంది తల్లిదండ్రులు అంగీకార పత్రాలు అందించారని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. హైదరాబాద్లోని మర్రి చెన్నారెడ్డి మానవవనరుల అభివృద్ధి కేంద్రంలో విద్యాశాఖ అధికారులతో మంత్రి సబిత సమావేశం నిర్వహించారు. విద్యా సంస్థల పునఃప్రారంభం, ఇతర అంశాలపై అధికారులతో సమీక్షించారు. తరగతి గదిలో విద్యార్థుల మధ్య భౌతికదూరం పాటించాలని మంత్రి స్పష్టం చేశారు. 9వ తరగతిలోపు విద్యార్థులకు డిజిటల్ తరగతులు కొనసాగుతాయన్నారు. మధ్యాహ్న భోజనానికి పాత స్టాక్ బియ్యాన్ని వాడొద్దని సంబంధిత అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. పాఠశాలకు వచ్చే విద్యార్థుల విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని పాఠశాలల యాజమాన్యాలను ఆదేశించామని మంత్రి వెల్లడించారు.
ఇవీ చదవండి..
related stories
-
విశాఖ బ్యాక్లాగ్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం
-
ప్రకాశం పాఠశాలకు వాటర్ ప్లాంట్ బహూకరణ
-
రాష్ట్రీయం కీచక హెడ్మాస్టర్