Wednesday, 05 Aug, 9.50 am ఈనాడు

తాజా వార్తలు
'ఆహా'లో ఆ సైకలాజికల్‌ థ్రిల్లర్‌

హైదరాబాద్‌: మలయాళ నటుడు ఫాహద్‌ ఫాజిల్‌ కథానాయకుడిగా తెరకెక్కిన సైకలాజికల్‌ థ్రిల్లర్‌ 'ట్రాన్స్‌'. ఈ ఏడాది ఫిబ్రవరిలో మలయాళంలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు ఈ చిత్రం తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తోంది. కరోనా వైరస్‌, లాక్‌డౌన్‌ కారణంగా థియేటర్‌లలో సినిమాల విడుదల ఆగిపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో విడుదలకు నోచుకోని పలు చిత్రాలతో పాటు, ఇతర భాషల్లోని చిత్రాలను తెలుగులోకి అనువదిస్తున్నారు.

తాజాగా ఈ చిత్రాన్ని తెలుగు ఓటీటీ 'ఆహా'లో విడుదల చేస్తున్నారు. ఆగస్టు 7న 'ట్రాన్స్‌' స్ట్రీమింగ్‌ మొదలవుతుంది. ఈ నేపథ్యంలో దర్శకుడు, నటుడు గౌతమ్‌ మేనన్‌ 'ట్రాన్స్‌' తెలుగు ట్రైలర్‌ను విడుదల చేశారు. నజ్రియా నజీమ్‌, గౌతమ్‌ మేనన్‌, చంబన్‌ వినోద్‌ జోసీ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. అన్వర్‌ రషీద్‌ దర్శకత్వం వహించారు.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Eenadu
Top