Sunday, 20 Oct, 10.50 am ఈనాడు

తాజా వార్తలు
ఆర్టీసీ సమ్మెను ఉద్ధృతం చేస్తాం: లక్ష్మణ్‌

హైదరాబాద్‌: తెలంగాణ ఆర్టీసీ సమ్మెను మరింత ఉద్ధృతం చేస్తామని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ స్పష్టం చేశారు. నాంపల్లిలోని పార్టీకార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం మెడలు వంచాలంటే ఆర్టీసీని, ప్రజాస్వామ్యాన్ని కాపాడే ఉద్యమంలో మేధావులతో సహా అన్ని వర్గాల ప్రజలు కలిసి రావాలని ఆయన కోరారు.ఈ సందర్భంగా లక్ష్మణ్‌ సమక్షంలో పలువురు వైద్యులు భాజపాలో చేరారు. పార్టీ కండువా కప్పి వారిని లక్ష్మణ్‌ సాదరంగా భాజపాలోకి ఆహ్వానించారు. ఆర్టీసీపై ప్రభుత్వ వైఖరిని కేంద్రం నిశితంగా గమనిస్తోందని లక్ష్మణ్‌ పేర్కొన్నారు.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Eenadu
Top