Tuesday, 02 Jun, 11.15 pm ఈనాడు

తాజా వార్తలు
'ఆయుష్మాన్ భారత్‌' నకిలీ వెబ్‌సైట్‌తో మోసం

నలుగురు యువకులు అరెస్టు

దిల్లీ: కేంద్రం ప్రవేశపెట్టిన ఆయుష్మాన్‌ భారత్‌ పథకం పేరిట నకిలీ వెబ్‌సైట్‌ నిర్వహిస్తున్న నలుగురు యువకులను దిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. ఆయుష్మాన్‌ ఆరోగ్య పథకం కింద 5వేల ఉద్యోగాలు అందుబాటులో ఉన్నాయని నిందితులు తమ వెబ్‌సైట్‌లో ప్రకటన ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు. వార్డుబాయ్‌, నర్స్‌, ల్యాబ్‌ సహాయకులు, ఫార్మసిస్టు వంటి ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించారని పోలీసులు పేర్కొన్నారు. ఇందుకోసం సైట్‌లో ఓ ఆన్‌లైన్‌ దరఖాస్తు పత్రాన్ని సృష్టించి ఒక్కొక్క దరఖాస్తుకి రూ. 300 నుంచి రూ. 500 వరకు చెల్లించేలా చేశారన్నారు. మొత్తంగా వీరు 4,500 మందిని మోసం చేసినట్లుగా తెలిపారు. నిందితుల నుంచి ల్యాప్‌టాప్‌, నాలుగు సెల్‌ఫోన్లు, ఏటీఎం కార్డులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.



Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Eenadu
Top
// // // // $find_pos = strpos(SERVER_PROTOCOL, "https"); $comUrlSeg = ($find_pos !== false ? "s" : ""); ?>