Wednesday, 04 Mar, 7.00 am ఈనాడు

తాజా వార్తలు
ఆయువు తీసిన ఆస్తి గొడవ

హైదరాబాద్‌ : ఆస్తి పంపకాల విషయంలో అత్త, ఆడపడచుల వేధింపులతో మహిళ విషంతాగి ఆత్మహత్య చేసుకుంది. మల్కాజిగిరి ఠాణా ఆర్కేనగర్‌లో మంగళవారం ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఎస్సై నాగేశ్వరరావు కథనం ప్రకారం.. తాడేపల్లిగూడెనికి చెందిన రాజ లలితకుమారి(40)కు ఆర్కే నగర్‌లో నివసించే ఆర్‌.రాజాకృష్ణతో 20 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు. రాజాకృష్ణకు ఆర్కేనగర్‌లో తండ్రి స్వార్జితమైన రెండు ఇళ్లు ఉన్నాయి. వీరు ఇద్దరు అన్నదమ్ములు. ప్రస్తుతం అన్నదమ్ములు ఒకే ఇంట్లో నివసిస్తున్నారు. తల్లి మరో ఇంటిలో ఉంటున్నారు. కొంతకాలం క్రితం తండ్రి కాలం చేశారు. అన్నదమ్ములు చెరో ఇల్లు తీసుకోవాలనుకున్నారు. పంపకాల విషయంలో తల్లి సావిత్రి, కోడలు లలితకుమారిల మధ్య వివాదం నడుస్తోంది. సావిత్రికి మద్దతుగా ఆమె కుమార్తెలు లక్ష్మి, నీరజలు నిలిచారు. వీరి వేధింపులు తట్టుకోలేక లలితకుమారి గతనెల 28న విషంతాగి అపస్మారక స్థితికి చేరుకుంది. చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మృతిచెందారు. ఆమె లేఖలో తనచావుకు అత్త, ఆడపడుచులు కారణమని ఆమె పేర్కొన్నారు. మృతురాలి తల్లి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.


Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Eenadu
Top