Sunday, 20 Sep, 5.40 am ఈనాడు

అదిలాబాద్
అధికారులొస్తే.. పతులదే పెత్తనం!

న్యూస్‌టుడే, మావల

మహిళా ప్రజాప్రతినిధుల మండలంగా మావలకు ప్రత్యేకత ఉంది. ఎంపీపీ, జడ్పీటీసీ సభ్యురాలు, ఎంపీటీసీతో పాటు మూడు పంచాయతీల సర్పంచులు మహిళలే. పెత్తనం మాత్రం మగవారే చెలాయిస్తున్నారనడానికి నిదర్శమే ఈ చిత్రాలు. మావలలో రైతు వేదిక పనులు పరిశీలించడానికి వచ్చిన అదనపు పాలనాధికారి డేవిడ్‌, జడ్పీ సీఈఓ కిషన్‌కు ఎంపీపీ చందాల ఈశ్వరికి బదులు ఆమె భర్త రాజన్న, జడ్పీటీసీ సభ్యురాలు నల్ల వనితకు బదులు ఆమె భర్త రాజేశ్వర్‌ దగ్గరుండి పనులు జరుగుతున్న తీరును వివరించారు. బట్టిసావర్గాం పంచాయతీకి వచ్చిన ఆ అధికారులకు అక్కడి సర్పంచి రాగం గంగమ్మకు బదులు ఆమె కుమారుడు గోవర్ధన్‌, ఎంపీటీసీ సభ్యురాలు దర్శనాల సంగీతకు బదులు భర్త ఏవాన్‌ ప్రగతి పనులను వివరించారు. మహిళా ప్రజాప్రతినిధుల బాధ్యతల్లో వారి కుటుంబీకులు జోక్యం ఉండరాదని ఇటీవల ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చినా.. అడుగడుగునా నిబంధనలకు నీళ్లొదులుతున్నారు.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Eenadu
Top