Tuesday, 15 Oct, 3.50 pm ఈనాడు

తాజా వార్తలు
అక్రమ కేసులపై కోర్టుకెళ్తాం: చంద్రబాబు

జ్ఞ

నెల్లూరు: వైకాపా నేతల దాడుల్లో నష్టపోయిన కుటుంబాలను పార్టీ తరఫున ఆదుకుంటామని తెదేపా అధినేత చంద్రబాబు హామీ ఇచ్చారు. నెల్లూరులోని అనిల్‌ గార్డెన్‌లో వైకాపా బాధితులతో చంద్రబాబు సమావేశమయ్యారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైకాపా నేతలు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. తెదేపా నేతలపై అక్రమ కేసులు బనాయించే పోలీసులపై కోర్టుకు వెళ్తామని హెచ్చరించారు. వైకాపా ఎమ్మెల్యేలు దోపిడీలు, దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని చంద్రబాబు ఆరోపించారు. బాధితులకు అండగా ఉండి వారి తరఫున పోరాటం చేస్తామని ఆయన చెప్పారు. మరోవైపు జిల్లాలోని నియోజకవర్గాల వారీగా పార్టీ పరిస్థితిపైనా చంద్రబాబు సమీక్ష నిర్వహిస్తున్నారు. సోమవారం ఉదయగిరి, సూళ్లూరుపేట, వెంకటగిరి, గూడూరు నేతలతో సమావేశమైన ఆయన.. ఈరోజు మిగతా నియోజకవర్గాల నేతలతో సమావేశం కానున్నారు.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Eenadu
Top