Friday, 26 Feb, 3.45 pm ఈనాడు

తాజా వార్తలు
అలిపిరి టోల్‌గేట్‌ ఛార్జీలు పెంపు

తిరుపతి: తిరుపతిలోని అలిపిరి టోల్‌గేట్‌ ఛార్జీలను ఏపీ ప్రభుత్వం పెంచింది. టోల్‌ ఛార్జీలను పెంచుతూ గతేడాది మార్చిలో తితిదే బోర్డు చేసిన తీర్మానం మేరకు రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం కారుకు రూ.15 నుంచి రూ.50, మినీ బస్సు, మినీ లారీకు రూ.50 నుంచి రూ.100కు పెంచుతున్నట్లు పేర్కొంది. లారీ, బస్సుకు ప్రస్తుతం ఉన్న టోల్‌ రుసుం రూ.100 నుంచి రూ.200 పెంచింది.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Eenadu
Top