Sunday, 11 Apr, 6.50 am ఈనాడు

ఒడిశా
అలుగులపై మరింత అధ్యయనం..!

ఉపగ్రహ ట్రాన్స్‌మిట్టర్లను అమర్చేందుకు యత్నాలు

రాయగడ పట్టణం, న్యూస్‌టుడే: రాష్ట్రంలో వేటగాళ్లు, అక్రమ వ్యాపారుల నుంచి తరచూ ముప్పు ఎదుర్కొంటున్న అలుగులపై సర్కార్‌ మరింత అధ్యయనం చేయనుంది. సంతానోత్పత్తి, సంరక్షణ కేంద్రాల నుంచి అడవిలోకి ప్రవేశపెట్టే సమయంలో వీటి కదలికలను గుర్తించేందుకు వీలుగా ఉపగ్రహ ట్రాన్స్‌మిట్టర్లను ఉపయోగించేందుకు సర్కార్‌ ప్రణాళికలు రచిస్తోంది. గత రెండేళ్లలో అలుగుల అక్రమ విక్రయాల నియంత్రణకు పెద్దపీట వేసిన రాష్ట్ర అటవీశాఖ దీనిపై మరింత లోతుగా దృష్టి సారించింది. దేశంలో ఒకేఒక్క అలుగు సంరక్షణ సంతానోత్పత్తి కేంద్రాన్ని కలిగి ఉన్న నందన్‌కానన్‌ జూ పార్కు ప్రతినిధులు వీటి సంరక్షణకు వివిధ సంస్థలు పనిచేసేలా దోహదపడుతుండడం గమనార్హం. ఆసియా దేశాల్లో ముఖ్యంగా చైనా, వియత్నాంలో అలుగు మాంసం, పొలుసు (చిప్పలు)కు విపరీతమైన గిరాకీ ఉంది. ఈ నేపథ్యంలో అంతర్జాతీయస్థాయిలో వీటి అక్రమ వ్యాపారం జోరుగా సాగుతుండడంతో ఈ జీవిపై వేట భయం వెంటాడుతున్నట్లు అటవీ వర్గాల సమాచారం.

వేటగాళ్లకు చిక్కుతున్న జీవులు: దేశంలో 2009 నుంచి 2017 మధ్య దాదాపు 6 వేల అలుగులు వేటగాళ్లకు చిక్కినట్లు ట్రాఫిక్‌ ఇండియా 2018 నివేదిక తెలియజేస్తోంది. 2008లో కేవలం 6 అలుగులతో నందన్‌కానన్‌లో సంతానోత్పత్తి, సంరక్షణ కేంద్రం ప్రారంభం కాగా ప్రస్తుతం వీటి సంఖ్య 26కి చేరుకున్నట్లు గణాంకాలు పేర్కొంటున్నాయి. సరరక్షణ కేంద్రం ఇన్‌ఛార్జి రాజేష్‌ మహాపాత్ర్‌ తాజాగా ఓ మీడియా సంస్థ ప్రతినిధితో మాట్లాడుతూ న్యూజిలాండ్‌ నుంచి ప్రత్యేక ట్రాన్స్‌మిట్టర్లను తెచ్చేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తున్నట్లు చెప్పడం గమనార్హం.

అలుగు ఆవాసాన్ని పరిశీలిస్తున్న అటవీ అధికారులు (పాతచ్రితం)

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Eenadu

related stories

Top