Sunday, 07 Mar, 5.07 am ఈనాడు

జాతీయ- అంతర్జాతీయ వార్తలు
అంగారకుడిపై పర్సెవరెన్స్‌ బుడిబుడి అడుగులు

లాస్‌ ఏంజిలెస్‌: అంగారకుడిపై కాలుమోపిన అమెరికా రోవర్‌ పర్సెవరెన్స్‌ ప్రయోగాత్మకంగా ముందుకు సాగింది. అక్కడి నేలపై 6.5 మీటర్ల దూరం ప్రయాణించిందని అమెరికా అంతరిక్ష సంస్థ (నాసా) తెలిపింది. పర్సెవరెన్స్‌ తొలి ప్రయాణం 33 నిమిషాల పాటు సాగింది. మొదట ఇది 4 మీటర్ల దూరం ప్రయాణించింది. ఆ తర్వాత 150 డిగ్రీల మేర ఎడమ వైపునకు మళ్లింది. అనంతరం 2.5 మీటర్ల మేర వెనక్కి ప్రయాణించి.. ఒక చోట ఆగింది. ఇది రోవర్‌కు తాత్కాలిక పార్కింగ్‌ ప్రదేశంగా ఉంటుంది. రోవర్‌లోని అన్ని వ్యవస్థలు, ఉపవ్యవస్థలను తనిఖీ చేయడానికి ఈ ప్రయాణం ఉపయోగపడిందని నాసా పేర్కొంది. రోవర్‌లోని ఆరు చక్రాలూ అద్భుతంగా పనిచేశాయని తెలిపింది. పర్సెవరెన్స్‌ పంపిన చిత్రాల్లో.. అది తిరిగిన ప్రదేశాల్లో చక్రాల జాడలు స్పష్టంగా కనిపించాయి.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Eenadu
Top