Sunday, 07 Mar, 5.20 am ఈనాడు

గుంటూరు
అటు పుర అధికారులు.. ఇటు పోలీసులు

సత్తెనపల్లి, న్యూస్‌టుడే : ఈ నెల పదో తేదీన జరగనున్న పుర ఎన్నికల పోలింగ్‌లో నూరు శాతం ఓటింగ్‌ లక్ష్యంగా అధికార యంత్రాంగం అడుగులు వేస్తోంది. ఓటరు చైతన్యంపై కలెక్టర్‌ వివేక్‌యాదవ్‌ ప్రత్యేక దృష్టి సారించారు. ఆయన ఆదేశాల మేరకు అటు పురపాలక సంఘ అధికారులు.. ఇటు పోలీసులు గడప గడపకు చేరువయ్యేలా ఓటరు చైతన్య కార్యక్రమాలు చేపట్టారు. ఎన్నికలు జరిగే గుంటూరు నగరం, తెనాలి, సత్తెనపల్లి, చిలకలూరిపేట, వినుకొండ, రేపల్లె పట్టణాలకు ఓటరు చైతన్య కార్యక్రమాల నిర్వహణకు ప్రత్యేకంగా వివిధ శాఖల జిల్లా అధికారుల్ని కలెక్టర్‌ ప్రత్యేకంగా నియమించారు. డ్వామా పీడీ డాక్టర్‌ శ్రీనివాసరెడ్డి సత్తెనపల్లిలో ఓటరు చైతన్య కార్యక్రమాల బాధ్యుడిగా వ్యవహరిస్తున్నారు. జిల్లా అధికారులతో పాటు పురపాలక సంఘాలకు ఎన్నికల అధికారులుగా నియమితులైన వారు పాల్గొంటున్నారు. గ్రామీణ ఎస్పీ విశాల్‌గున్నీ ఆదేశాల మేరకు డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు పట్టణాల్లోని వార్డుల్లో ఓటరు చైతన్య సదస్సులు నిర్వహిస్తున్నారు.పోలింగ్‌కు సమయం దగ్గరవుతున్న కొద్దీ ఓటరు చైతన్య కార్యక్రమాలు విస్తృతమవుతున్నాయి. యువత, మహిళలు తదితరులు భాగస్వాములవుతున్నారు.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Eenadu
Top