Wednesday, 05 Aug, 10.00 am ఈనాడు

తాజా వార్తలు
అయోధ్యకు బయలుదేరిన ప్రధాని మోదీ

దిల్లీ: ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రత్యేక విమానంలో దిల్లీ నుంచి అయోధ్యకు బయల్దేరారు. 11.30గంటలకు ప్రధాని అయోధ్య చేరుకుంటారు. మొదట హనుమాన్‌గఢీ ఆలయానికి వెళ్లి ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం 12 గంటలకు భూమిపూజ ప్రదేశానికి చేరుకుంటారు. 12.30 గంటల నుంచి 12.45 వరకు రామమందిరం భూమిపూజ కార్యక్రమంలో పాల్గొంటారు. భూమి పూజకు ముందు పారిజాత మొక్కను నాటతారు.

రామమందిరం భూమిపూజ సందర్భంగా అయోధ్యలో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎస్పీజీ బలగాలు ఇప్పటికే అయోధ్యను తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. 45 ఏళ్లలోపు ఉండి కరోనా నెగిటివ్‌ వచ్చిన వారికే ప్రధాని భద్రతా బృందంలో చోటు కల్పించారు. అయోధ్యను ఆనుకుని ఉన్న 9 జిల్లాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. అయోధ్య-నేపాల్‌ సరిహద్దు బస్తీ డివిజన్‌లో ప్రత్యేక ఆంక్షలు విధించారు. సరిహద్దు ప్రాంతాలు, జలమార్గాలపై భద్రతా బలగాలు నిఘా పెంచాయి.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Eenadu
Top