Wednesday, 25 Sep, 6.30 am ఈనాడు

మెదక్
బైక్‌ చోరీ కేసులో ఎనిమిది నెలల జైలు

పెద్దశంకరంపేట: పేటలో బైక్‌ చోరీ చేసిన కేసులో నిందితుడికి ఎనిమిది నెలల జైలు శిక్ష విధిస్తూ జోగిపేట మున్సిఫ్‌ కోర్టు తీర్పు ఇచ్చింది. 2018 నవంబర్‌లో పేట మండలం వీరోజిపల్లి గ్రామానికి చెందిన శివకుమార్‌కు చెందిన రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ బైక్‌ చోరీకి గురైంది. రెండు రోజుల్లోనే స్థానిక పోలీసులు కేసు ఛేదించారు. కౌడిపల్లి మండలం బుజ్రాంపేటకు చెందిన దిలిప్‌కుమార్‌ అనే వ్యక్తి నుంచి బైక్‌ స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి నిందితుడిని రిమాండ్‌కు తరలించగా మంగళవారం కోర్టు తుది తీర్పు వెలువరించింది.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Eenadu
Top