Friday, 26 Feb, 1.56 pm ఈనాడు

తెలంగాణ బ్రేకింగ్ న్యూస్
బెంగాల్‌ అవినీతికి ఓ టీకా కావాలి : నడ్డా

కోల్‌కతా: అధికార తృణమూల్‌ నేతల అవినీతి, వేధింపులకు వ్యతిరేకంగా బెంగాల్‌ ప్రజలకు ఓ టీకా కావాలని భాజపా జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. తాము అధికారంలోకి రాగానే ఆ టీకా కార్యక్రమం ప్రారంభిస్తామని తెలిపారు. గురువారం కోల్‌కతాలో 'లోకొ సోనార్‌ బంగ్లా' (బంగారు బంగ్లాయే లక్ష్యం) ప్రచారాన్ని ఆయన ప్రారంభించారు. ఇందులో భాగంగా దాదాపు 2 కోట్ల మంది ప్రజల అభిప్రాయాలను సేకరించి.. బెంగాల్‌ ఎన్నికల ప్రణాళికను భాజపా తయారు చేయనుంది. ఒక రోజు పర్యటనకు బెంగాల్‌ వచ్చిన నడ్డా ఉత్తర 24 పరగణాస్‌ జిల్లాలో జరిగిన బహిరంగ సభలో ప్రసంగించారు. ఈ సందర్భంగా తృణమూల్‌పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Eenadu
Top