Friday, 02 Oct, 5.15 am ఈనాడు

మార్కెట్‌
భారత్‌లో 3% వరకు ధరలు పెంచుతాం: బీఎండబ్ల్యూ

దిల్లీ: జర్మన్‌ విలాస కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ వచ్చే నెల నుంచి భారత్‌లో తమ కార్ల ధరల్ని మోడల్‌ ఆధారంగా 3 శాతం వరకు పెంచేందుకు నిర్ణయించింది. 'బీఎండబ్ల్యూ గ్రూప్‌ ఇండియా, వినియోగదార్లు కోరుకుంటున్న మంచి ఉత్పత్తుల్ని అందిస్తూ వస్తోంది. నవంబరు 1 నుంచి బీఎండబ్ల్యూ, మినీ ఉత్పత్తుల పోర్ట్‌పోలియో ధరల్ని పెంచుతామ'ని బీఎండబ్ల్యూ గ్రూప్‌ ఇండియా అధ్యక్షుడు విక్రమ్‌ వెల్లడించారు.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Eenadu
Top