Friday, 24 Sep, 7.20 am ఈనాడు

కడప
భద్రతలో రాజీ పడేదిలేదు

గుంతకల్లు రైల్వే డివిజన్‌ భద్రతాధికారి శ్రీరామ్‌నాయక్‌

మాట్లాడుతున్న శ్రీరామ్‌నాయక్‌

నందలూరు, కడప ఏడురోడ్లు, న్యూస్‌టుడే: రైల్వే ప్రయాణికుల భద్రతలో రైల్వేశాఖ ఏమాత్రం రాజీ పడదని, భద్రత ప్రమాణాలు పాటిస్తూ సురక్షితంగా రైళ్లను నడపాలని దక్షిణ మధ్య రైల్వే గుంతకల్లు డివిజన్‌ సీనియర్‌ భద్రతాధికారి శ్రీరామ్‌నాయక్‌ పేర్కొన్నారు. భారతీయ రైల్వే స్వచ్ఛత పక్షోత్సవంలో భాగంగా రైళ్ల భద్రతపై నందలూరు రైల్వే ఇనిస్టిట్యూట్‌లో గురువారం రైల్వే కార్మికులతో నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. రైళ్లు నడిపేటప్పుడు పాటించాల్సిన నిబంధనలు, జాగ్రత్తలు వివరించారు. ప్రమాదరహితంగా రైళ్లను నడుపుతూ ప్రయాణికులకు భరోసా కల్పించాలని కోరారు. అనంతరం కార్మికుల సందేహాలు నివృత్తి చేశారు.

అనంతరం కడప రైలునిలయానికి చేరుకుని తనిఖీలు నిర్వహించారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని అధికారులను ఆదేశించారు. ● కడప రైలు నిలయానికి శుక్రవారం గుంతకల్లు డివిజనల్‌ చీఫ్‌ ఇంజినీరింగ్‌ ప్లానింగ్‌ అధికారి రంగరాజు రానున్నట్లు మేనేజరు జాఫర్‌హుస్సేన్‌ తెలిపారు. కార్యక్రమంలో ఏడీఎంఈ ఆనంద్‌కుమార్‌, నందలూరు రైలునిలయం మేనేజరు శేఖర్‌కుమార్‌, రైల్వే ఇనిస్టిట్యూట్‌ కార్యదర్శి గౌస్‌మొహిద్దీన్‌, తదితరులు పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Eenadu
Top