Thursday, 05 Aug, 6.26 am ఈనాడు

మహబూబ్ నగర్
భూసేకరణకు సహకరించండి

రాజోలి, న్యూస్‌టుడే : జిల్లాలో నిర్మించనున్న ఆరు వరుసల జాతీయ రహదారి(భారత్‌మాల)కి సంబంధించి బుధవారం రాజోలిలో భూసేకరణ చేపట్టారు. అదనపు కలెక్టర్‌ రఘురామశర్మ, రెవెన్యూ అధికారులతో కలిసి రైతులతో మాట్లాడారు. జాతీయ రహదారి నిర్మాణానికి రైతులు భూములు ఇచ్చి సహకరించాలని, ఎకరాకు వర్షాధార భూమికి రూ.6.75 లక్షలు, నీటి లభ్యత ఉన్న భూమికి రూ.9.78 లక్షలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. మొత్తం జిల్లాలో 774.51 ఎకరాల భూమిని సేకరించనుండగా, రాజోలిలో 98 మంది రైతులకు సంబంధించి 77.69 ఎకరాలు సేకరించనున్నామన్నారు. బహిరంగ మార్కెట్లో భూముల విలువ రూ.15 నుంచి రూ.30 లక్షల వరకు ఉందని తక్కువగా ఇస్తే తాము నష్టపోతామని కొందరు రైతులు పేర్కొన్నారు. ఇది ప్రభుత్వం నిర్ణయించిన ధరని, అధిక పరిహారం కావాలంటే కోర్టును ఆశ్రయించవచ్చని అధికారులు తెలిపారు. చివరకు ప్రభుత్వం నిర్ణయించిన ధరకు భూమిని ఇచ్చేందుకు 60 మంది రైతులు ముందుకొచ్చినట్లు పేర్కొన్నారు. తహసీల్దార్‌ శ్రీనివాస్‌శర్మ, ఉప తహసీల్దార్‌ వెంకటరమణ, నరేశ్‌ తదితరులున్నారు.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Eenadu
Top