Monday, 19 Apr, 4.30 am ఈనాడు

నిజామాబాద్
చెక్‌డ్యాంలను సద్వినియోగం చేసుకోవాలి

గుండెనెమ్లిలో మంజీరా నదిపై చెక్‌డ్యాం నిర్మాణానికి భూమి పూజ చేస్తున్న ఎమ్మెల్యే హన్మంత్‌షిండే

బిచ్కుంద గ్రామీణం, న్యూస్‌టుడే: రైతులు పంటలు పండించుకోవడానికి చెక్‌డ్యాంలను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే హన్మంత్‌ షిండే అన్నారు. ఆదివారం మండలంలోని గుండెనెమ్లి, పుల్కల్‌ గ్రామాల్లో మంజీర నదిపై, పెద్దదడ్గి గ్రామ సమీపంలో ఉన్న కౌలాస్‌ వాగు పైన చెక్‌డ్యాంల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఆనంతరం పలు గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... చెక్‌డ్యాంలు పూర్తయితే రైతులు రెండు పంటలు పండించుకోవచ్చన్నారు. గుండెనెమ్లి చెక్‌డ్యాంకు రూ.24.63 లక్షలు, పుల్కల్‌కు రూ. 15.11 లక్షలు, పెద్దదడ్గికి రూ.3.45 లక్షలు కేటాయించినట్లు తెలిపారు. ఎంపీˆపీ అశోక్‌పాటిల్‌, తెరాస మండలాధ్యక్షుడు వెంకట్రావ్‌దేశాయ్‌, వైస్‌ ఎంపీపీ రాజుపటేల్‌, నాల్చర్‌ రాజు, సర్పంచులు విజయలక్ష్మి, రాణి, సాయిలు, ఎంపీటీసి సభ్యుడు సిద్దిరాంపటేల్‌ పాల్గొన్నారు.
జక్కాపూర్‌(నిజాంసాగర్‌): నాగమడుగు ఎత్తిపోతల పథకం శంకుస్థాపనకు సీఎం కేసీఆర్‌ రానున్న నేపథ్యంలో ఏర్పాట్లను త్వరితగతిన పూర్తి చేయాలని ఎమ్మెల్యే హన్మంత్‌షిండే అన్నారు. మండలంలోని జక్కాపూర్‌ గేటు సమీపంలో నిర్మిస్తున్న పైలాన్‌ పనులను ఆదివారం పరిశీలించారు. కామారెడ్డి సీఈ శ్రీనివాస్‌, బాన్సువాడ ఎస్‌ఈ మధుసూదన్‌, నిజాంసాగర్‌ ఈఈ రమేష్‌, డీఈఈ దత్తాత్రి, ఏఈ రాజ్‌కమల్‌ తదితరులు పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Eenadu

related stories

Top