Friday, 02 Oct, 4.07 am ఈనాడు

జాతీయ- అంతర్జాతీయ వార్తలు
దేశంలో 764 లక్షల టన్నుల ధాన్యం సేకరణ

తెలంగాణలో 111.26, ఏపీలో 81.44 లక్షల మెట్రిక్‌ టన్నులు

ఈనాడు, దిల్లీ: దేశవ్యాప్తంగా అక్టోబర్‌ 1వ తేదీ (గురువారం) నాటికి 764.87 లక్షల మెట్రిక్‌ టన్నుల వరిధాన్యాన్ని సేకరించినట్లు భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ) వెల్లడించింది. 2019-20 వ్యవసాయ సంవత్సరానికి సంబంధించి సేకరించిన వరిధాన్యంలో పంజాబ్‌, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల వాటా 55.98% ఉన్నట్లు గురువారం ఒక ప్రకటనలో పేర్కొంది. పంజాబ్‌లో 162.33 (21.22%), తెలంగాణలో 111.26 (14.54%), ఆంధ్రప్రదేశ్‌లో 81.44 (10.64%), ఛత్తీస్‌గఢ్‌లో 73.18(9.56%) లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని సేకరించినట్లు వివరించింది.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Eenadu
Top