Sunday, 07 Mar, 5.20 am ఈనాడు

తూర్పు గోదావరి
ఎమ్మెల్సీ పోలింగ్‌లో అప్రమత్తంగా వ్యవహరించాలి

సూచనలిస్తున్న పరిశీలకుడు శామ్యూల్‌ ఆనంద్‌

కాకినాడ కలెక్టరేట్‌: ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పోలింగ్‌ విధులు అప్రమత్తతతో నిర్వహించాలని ఎన్నికల పరిశీలకుడు శామ్యూల్‌ ఆనంద్‌కుమార్‌ సూచించారు. శనివారం కలెక్టర్‌ మురళీధర్‌రెడ్డితో కలిసి ఆయన పోలింగ్‌ సిబ్బంది, సూక్ష్మ పరిశీలకులకు వేర్వేరుగా శిక్షణ ఇచ్చారు. హ్యాండ్‌ బుక్‌ సమాచారాన్ని ఆకళింపు చేసుకోవాలనీ..బ్యాలెట్‌ పత్రాలు, సామగ్రి విషయంలో జాగ్రత్త వహించాలన్నారు. ఈనెల 14న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్‌ ఉందనీ.. ఏజెన్సీలో మాత్రం మధ్యాహ్నం 2 గంటల వరకే అన్నారు. సూక్ష్మపరిశీలకులు పోలింగ్‌ను నిశితంగా పరిశీలించాలని ఆదేశించారు. ఎన్నికల కమిషన్‌ మార్గదర్శకాల ప్రకారం పోలింగ్‌లో గుర్తించిన అంశాలను నివేదిక రూపంలో ఇవ్వాలన్నారు. సందేహాలకు 83329 62889లో సంప్రదించాలని సూచించారు. ఏఆర్వో, డీఆర్వో సత్తిబాబు, ఆర్డీవో మల్లిబాబు, ఎన్నికల డీటీ జగన్నాథం తదితరులు పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Eenadu
Top