విజయనగరం
ఎండా కాలం.. ఉపాధి అధనం

గుమ్మలక్ష్మీపురం, న్యూస్‌టుడే: వేసవి ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటున్న దృష్ట్యా అదనపు వేతనం ఉపాధి కూలీలకు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు అదనంగా 20 నుంచి 30 శాతం వేసవి భత్యం ఫిబ్రవరి నుంచి జూన్ వరకు చెల్లించనున్నారు. దీంతో కూలీల సంఖ్య పెరిగే ఆస్కారం ఉందని అధికారులు చెబుతున్నారు.
జిల్లాలో మొత్తం 44,677 శ్రమశక్తి సంఘాలు ఉండగా.. వీటిలో 4,65,921 జాబ్‌కార్డులు, 8,18,903 మంది కూలీలు ఉన్నారు. ప్రస్తుతం 2.9 లక్షల మంది వరకు పనికి హాజరవుతున్నారు. ఒక కూలి 80 క్యూబిక్ మీటర్ల పని చేస్తే 20 శాతం అదనంగా చెల్లిస్తారు ప్రస్తుతం రూ.237 కూలీగా నిర్ణయించారు.
అవగాహన కల్పిస్తున్నాం: కూలీలకు పెరిగిన భత్యం గురించి గ్రామాల్లో అవగాహన కల్పించాలని ఇప్పటికే ఎంపీడీవోలు, ఏపీవోలు, ఉపాధి సిబ్బందికి చెప్పాం.అడిగిన వారందరికీ పనులు కల్పిస్తున్నాం. గుడారాలు, ప్రథమ చికిత్స కిట్లు గతంలో ఇచ్చినవి వినియోగిస్తున్నారు.
- నాగేశ్వరరావు, ఉపాధి పథకం పీడీ, విజయనగరం
related stories
-
అనంతపురం రూ కోట్లు కుమ్మరింత ..ఉపాధి గోరంత
-
మహబూబ్ నగర్ ఉపాధిలో అతివల ముందంజ
-
ఆంధ్ర ప్రదేశ ముఖ్యాంశాలు భారీగా వెండి పట్టివేత