Thursday, 13 Aug, 4.35 pm ఈనాడు

తాజా వార్తలు
ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురుదెబ్బ

ఇళ్లస్థలాలకు మైనింగ్‌ భూమి కేటాయింపుపై స్టే

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి హైకోర్టులో మరో ఎదురుదెబ్బ తగిలింది. పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ కోసం టంగుటూరు మండలంలోని మైనింగ్‌ భూములను కేటాయించడంపై హైకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. మైనింగ్‌ భూమిని ఇతర అవసరాలకు కేటాయించవద్దని ప్రభుత్వానికి ఆదేశించింది. ఈ మేరకు ఇళ్లస్థలాలకు మైనింగ్‌ భూమి కేటాయింపుపై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ అంశంపై కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Eenadu
Top