Monday, 30 Oct, 4.16 am ఈనాడు

హైదరాబాద్
ఫిరంగి పునరుద్ధరణ.. చెరువులకుఆలంబన


నాలా బాగుచేస్తే ప్రయోజనాలు ఎన్నో..
న్యూస్‌టుడే, షాబాద్‌
తూ ర్పు తెలంగాణలో తాగునీరు, సాగునీటికి ఇబ్బందులు కలగకుండా నాటి నిజాం పాలకులు చెరువులు, కాలువలు, కత్వలు నిర్మించారు. 1872 సంవత్సరంలో ఏర్పడిన కరవు కాటకాలను అధిగమించేందుకు, అలాగే భవిష్యత్తులో ఈ ప్రాంతంలో నీటి కరవు దాపురించకుండా ఉండేందుకు అప్పటి నిజాం పాలకులు ఫ్రెంచి, ఇంగ్లాండు ఇంజినీర్ల సహాయంతో ఆనకట్టను నిర్మించారు. దీని నుంచి షాబాద్‌ మండలం చందన్‌వళ్లి సమీపంలో ఈసీ వాగుపై ఫిరంగినాలాను నిర్మించారు. ఈ నాలాతో పూర్వ రంగారెడ్డి జిల్లా పశ్చిమ ప్రాంతం నుంచి తూర్పు ప్రాంతానికి అవసరమైన నీటి వనరులను సమకూర్చాలనేది ముఖ్య ఉద్దేశం. షాబాద్‌ మండలం చందనవళ్లి చెరువు నుంచి సుమారు 85 కి.మీల మేర దీని నిర్మాణం ఉంటుంది. 50 చెరువులను అనుసంధానం చేస్తుంది. ఒక చెరువు నిండిన తరువాత దాని అలుగు నుంచి మరో చెరువులోకి వెళ్లేందుకు వీలుగా నిర్మించారు. అప్పట్లో చందనవళ్లి నుంచి ఇబ్రహీంపట్నం వరకు ఉన్న చెరువులన్నీ నిండేవి. ఫలితంగా వ్యవసాయం ఎంతో అభివృద్ధి చెందింది. వందలాది గ్రామాలకు తాగునీరు, సాగునీరు అందించిన ఈ ఫిరంగి నాలా(కాలువ) నేడు పాలకుల నిర్లక్ష్యంతో కాలక్రమేణ భూకబ్జాదారుల వశమై ఆనవాలు కోల్పోయింది.

చరిత్ర ఏం చెబుతోందంటే..
ఇక్కడ నిర్మించిన కరకట్ట ఈసీవాగు నుంచి ఫిరంగి కాలువకు నీరు మళ్లించేందుకు నిర్మించారు. కరకట్ట సామర్థ్యానికి మించి వచ్చిన నీటిని హిమాయత్‌సాగర్‌ జలాశయానికి మళ్లించేలా ఏర్పాటు చేశారు. అలనాటి ఇంజినీర్ల నైపుణ్యానికి ఈ నిర్మాణం నిలువెత్తు నిదర్శనం. షాబాద్‌ మండలం నుంచి ప్రారంభమయ్యే కాలువ శంషాబాద్‌, రాజేంద్రనగంü, సరూర్‌నగర్‌, హయÅüనగర్‌ మండలాల గుండా 85 కిలో మీటర్లు ప్రవహించి ఇబ్రహీంపట్నం చెరువును చేరేది. షాబాద్‌ మండలం చందనవళ్లి నుంచి ప్రారంభమై సోలిపేట్‌, మద్దూరుల మీదుగా శంషాబాద్‌ మండలం గూడూరు వద్ద కత్వలో కలుస్తూ.. పిల్లోనిగూడ, జూకల్‌, కాచారం, చౌదరిగూడ, వూటుపల్లి, తొండుపల్లి గుండా శంషాబాŸü చేరుకుని సరూంüనగర్‌ మండలంలోని బాలాపూంü, కొత్తపేట, ఎర్రకుంట, పహాడీషరీఫ్‌, సుల్తాన్‌పూర, మీంüపేట్‌, వెంకటాపూర్‌, నాదర్‌గుల్‌, హయత్‌నగర్‌ మండలం కోహెడ, ఇంజాపూర్‌, మన్సూర్‌గూడ, జాలగూడ, మహేశ్వరం మండలంలోని తుక్కుగూడ గుండా కాలువ గమనం సాగేది. ఈ క్రమంలో చందనవళ్లి పెద్దచెరువు, తుక్కుగూడ చెరువు, ఇంజాపూర్‌ చెరువు, తుర్కయంజాల్‌ కొత్త చెరువులను కలుపుతూ ఇబ్రహీంపట్నం పెద్ద చెరువు వరకు ఉన్న 50 చెరువులను ఫిరంగి కాలువ అనుసంధానం చేస్తోంది. సుమారు 10 వేల హెక్టారుల వ్యవసాయ భూమికి సాగునీరు అందేదని చరిత్ర చెబుతోంది.

కబ్జా కోరల్లో..
ఫిరంగి కాలువ నేటి పాలకుల నిర్లక్ష్యం, అధికారుల వైఫల్యం కారణంగా కబ్జాకు గురయ్యింది. షాబాద్‌ మండలంలో నాలా ప్రారంభం నుంచే దున్ని పంటలు సాగు చేస్తున్నారు. శంషాబాద్‌, సరూర్‌నగర్‌, మహేశ్వరం, హయత్‌నగర్‌, ఇబ్రహీంపట్నం మండలాలలో ఏకంగా ఫిరంగి కాలువ పూడ్చేసి వెంచర్లు ఏర్పాటు చేశారు.

హామీలన్నీ నీటిమీద రాతలే..
2003 సంవత్సరంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇంజాపూంü, ఇబ్రహీంపట్నం చెరువుల దుస్థితి గమనించి, ఫిరంగి కాలువను పునరుద్ధరించేందుకు రూ.50 లక్షలు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. కానీ అది అమలుకు నోచుకోలేదు. దివంగత సీఎం వైఎస్‌.రాజశేఖర్‌రెడ్డి పల్లెబాటలో భాగంగా చందనవళ్లిలో పర్యటించారు. ఫిరంగి నాలా పునరుద్దరణకు ఎన్ని నిధులు ఖర్చు అయినా కేటాయిస్తామని హామీలు గుప్పించారు. అనంతరం ఆ మాటలన్నీ నీటిమీద రాతలుగానే మిగిలాయి. తెలంగాణ ప్రజలకు నిజాంనవాబు కానుకగా ఇచ్చిన కాలువను వెంటనే బాగు చేయాలని 2012 సంవత్సరంలో టఫ్‌ నాయకురాలు విమలక్క, కేశవరావ్‌ జాదవ్‌లు పాదయాత్ర నిర్వహించారు. ప్రభుత్వానికి నివేదిక కూడా అందించారు. 2014 ఎన్నికల సందర్భంగా కాలువను పునరుద్ధరిస్తామని నాయకులు హామీలు ఇచ్చినా కార్యరూపం దాల్చలేదు. ఫిరంగి కాలువను కబ్జా చేసి కోట్లు గడించిన రాజకీయ నాయకుల ఒత్తిళ్ల కారణంగానే కాలువ పునరుద్ధరణకు నోచుకోవటం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. మిషన్‌ కాకతీయలో భాగంగా ఫిరంగినాలాను పునరుద్ధరిస్తే 50 చెరువులు నిండి వేల ఎకరాల ఆయకట్టుకు నీరందుతుందని అందుకు జిల్లాకు చెందిన మంత్రులు, శాసనసభ్యులు కృషి చేయాలని స్థానికులు కోరుతున్నారు.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Eenadu
Top