menu
ఈనాడుఖమ్మం

గొల్లగూడెం అభివృద్ధికే ప్రత్యేక పంచాయతీ

17 May 2018, 5:25 am


గొల్లగూడెం(పెనుబల్లి), న్యూస్‌టుడే: గొల్లగూడెం, కొత్త లంకపల్లి అభివృద్ధి చేయాలనే సంకల్పంతోనే ఎందరు అడ్డుపడ్డా కొత్త లంకపల్లి పేరుతో ప్రత్యేక పంచాయతీ ఏర్పాటు చేయడం జరిగిందని డీసీసీబీ ఛైర్మన్‌ మువ్వా విజయ్‌బాబు అన్నారు. పెనుబల్లి మండలం గొల్లగూడెంలో బుధవారం పలు పార్టీల నుంచి దాదాపు 70 కుటుంబాలు డీసీసీబీ ఛైర్మన్‌ మువ్వా విజయ్‌బాబు సమక్షంలో తెరాస పార్టీలోకి రావటంతో మువ్వా పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మువ్వా మాట్లాడుతూ... దాదాపు 15 ఏళ్లు పాటు లంకపల్లి పంచాయతీని పాలించిన నాయకులు ఆ పంచాయతీలో భాగమైన గొల్లగూడెం అభివృద్ధిని మరిచారని, ఏ వీధిలో లైట్లు ఉండేవి కావని, అంతర్గత రహదారులు అత్యంత దుర్భురంగా ఉండేవన్నారు.

Loading...

No Internet connection

Link Copied