Thursday, 04 Mar, 4.26 am ఈనాడు

మహబూబ్ నగర్
గుణపాఠం చెప్పేందుకు ఇదే సమయం

పాతబస్టాండ్‌, (నారాయణపేట), న్యూస్‌టుడే : పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికలు ముఖ్యమంత్రి కేసీీఆర్‌ చేతిలో మోసపోయిన నిరుద్యోగులకు మంచి అవకాశమని, ప్రభుత్వానికి గుణపాఠం చెప్పడానికి ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. బుధవారం నారాయణపేటలో నిర్వహించిన ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ఉద్యోగాల ఖాళీలను భర్తీ చేయలేని కేసీీఆర్‌కు ఓట్లు అడిగే హక్కు లేదన్నారు. అన్నం పెట్టే రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వకుండా, చనిపోయిన తరవాత రూ.5 లక్షల బీమా ఇస్తామనడమేంటని అన్నారు. రైతు ప్రాణం విలువ రూ.5 లక్షలా అని ప్రశ్నించారు. పీవీ నర్సింహారావు కుటుంబానికి గుర్తింపు తెచ్చింది కాంగ్రెస్‌ పార్టీయేనన్నారు. అలాంటి పార్టీని వీడి తెరాసలో చేరినందుకు సురభి వాణికి ఓటమి తప్పదన్నారు. కేంద్రంలోని మోదీ, రాష్ట్రంలో కేసీఆర్‌ కుమ్మక్కై రాష్ట్రాన్ని ఆగం చేస్తున్నారన్నారు. 2017లో ఎమ్మెల్సీగా గెలిచిన రాంచందర్‌రావు తన పదవీ కాలంలో ఏం చేశారో తెలపాలన్నారు. గతంలో ఉద్యమం చేసిన ఆర్టీసీ కార్మికులను, నిరుద్యోగులను, విద్యుత్తు ఉద్యోగులను, సింగరేణి కార్మికులను, కనీసం తెలంగాణ కోసం కొట్లాడి ప్రాణాలు అర్పించిన అమరవీరులను పరామర్శించింది లేదన్నారు.ఒక్కొక్కరు 50 ఓట్లు లక్ష్యంగా ప్రతి కార్యకర్త సైనికుల్లా పని చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు కుంభం శివకుమార్‌రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శులు వంశీచంద్‌రెడ్డి, సంపత్‌కుమార్‌, పీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి, నాయకులు కొత్వాల్‌, మధుసూదన్‌రెడ్డి, ప్రదీప్‌కుమార్‌, వేణుగోపాల్‌, వెంకటేశ్వర్‌, శివకుమార్‌, సలీం పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Eenadu
Top