Wednesday, 15 Sep, 5.15 pm ఈనాడు

మార్కెట్‌
Infosys: ఐటీ పోర్టల్‌ను సరిచేయడానికి నేటితో ముగియనున్న తుదిగడువు..!

ఇంటర్నెట్‌డెస్క్‌: ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ పోర్టల్‌ను సరిచేయడానికి ఇన్ఫోసిస్‌కు ఇచ్చిన గడువు నేటితో ముగియనుంది. భారత్‌లో ప్రారంభించిన ఐటీ పోర్టల్‌ కాంట్రాక్టు ఇన్ఫోసిస్‌కు దక్కింది. పోర్టల్‌ జూన్‌ 8వ తేదీన అందుబాటులోకి వచ్చాక పలు సమస్యలు తలెత్తుతున్నాయని పన్నుచెల్లింపుదారులు ఫిర్యాదులు చేశారు. ఈ నేపథ్యంలో ఆగస్టులో ఆర్థిక మంత్రిత్వ శాఖ ఈ సమస్యలపై ఇన్ఫోసిస్‌ను ప్రశ్నించింది. ఈ క్రమంలో ఇన్ఫోసిస్‌ సీఈవో సలీల్‌ ఫరేఖ్‌కు సమన్లు జారీ చేసి వివరణ కోరింది. ఈ సమస్యలను పరిష్కరించడానికి ఇన్ఫోసిస్‌కు నేటి వరకు గడువు ఉంది.

ఇప్పటికే ఇన్ఫోసిస్‌ 750 మంది సాంకేతిక సిబ్బందిని దీనికి కేటాయించి పనిచేస్తోంది. ఈ ప్రాజెక్టు విలువ రూ.4,000 కోట్లు. పోర్టల్‌ ప్రారంభమైనప్పటి నుంచి సాంకేతిక సమస్యలు, ఎర్రర్స్‌, పోర్టల్‌ వినియోగంలో ఇబ్బందులు, చాలా ఆప్షన్లు పనిచేయకపోవడం వంటివి తలెత్తున్నాయి. తాజాగా ఇన్‌కమ్‌ ట్యాక్స్ చెల్లింపులకు తుదిగడువు జులై 31 నుంచి డిసెంబర్‌ 31 వరకు పొడిగించారు. కానీ, ఆలస్యం అయ్యే ప్రతి నెలకు కొంత మొత్తం అదనంగా చెల్లించాల్సి ఉంది. ఐటీ పోర్టల్‌లోనే సమస్యలు పెట్టుకొని ప్రజల మీద భారం మోపటం ఏంటని కూడా ఆర్థిక శాఖను పలువురు ప్రశ్నిస్తున్నారు.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Eenadu
Top