Friday, 30 Oct, 1.50 am ఈనాడు

కర్ణాటక
ఇంటి చోరుడు..

బెంగళూరు (మల్లేశ్వరం), న్యూస్‌టుడే: లాక్‌డౌన్‌తో ఉపాధి అవకాశాలు కోల్పోయి చోరునిగా మారిన షేక్‌బాబు(24) అనే యువకుడ్ని సంజయనగర పోలీసులు అరెస్టు చేశారు. తాళాలు వేసి ఉన్న ఇళ్లను గుర్తించి, రాత్రుళ్లు దొంగతనాలకు పాల్పడుతున్న నిందితుడి నుంచి రూ.8.37 లక్షల ఆభరణాలను స్వాధీనపరచుకున్నారు. కోరమంగల పరిధి రాజేంద్రనగరకు చెందిన నిందితుడు జీవనోపాధి కోసం కూలీ పనులు చేసేవాడు. చెడు వ్యసనాలు, కుటుంబ నిర్వహణ కష్టం కావడంతో దొంగతనాల బాటపట్టాడు. సంజయనగరలో ఒక ఇంట్లో దొంగతనం చేసిన సమయంలో అక్కడి సీసీ కెమెరాలో చిత్రాలు రికార్డు అయ్యాయి. వాటి ఆధారంగా కార్యాచరణ నిర్వహించి నిందితుడ్ని అరెస్టు చేశారు.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Eenadu
Top