చిత్తూరు
ఇసుకాసురులు పెరిగిపోయారు

సమావేశంలో మాట్లాడుతున్న చింతా మోహన్
శ్రీకాళహస్తి: రాష్ట్రంలో ఇసుకాసురులు, భూబకాసురులు ఎక్కువైపోయారని కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ ఆరోపించారు. శ్రీకాళహస్తిలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బుధవారం విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆలోచన, అవగాహన, పద్ధతి లేకుండా సీఎం జగన్మోహన్రెడ్డి పాలన సాగిస్తున్నారన్నారు. రాష్ట్రం మరింత పేదరికంలోనికి వెళ్లిపోతోందన్నారు. కేంద్రం ఇటీవల బడ్జెట్లో రాష్ట్రానికి ఒక్క రూపాయి నిధులు కేటాయించలేదని, ఇక్కడి నేతలెవ్వరూ దీనిపై మాట్లాడకపోవడం శోచనీయమన్నారు. ప్రజా పంపిణీ వ్యవస్థ పూర్తిగా కుంటుపడిపోయిందని తెలిపారు. దౌర్జన్యాలు, దాడులు పెరిగిపోతున్నాయని, ఎన్నికల్లో నామపత్రాలు తొలగించడం, అభ్యర్థుల ముందే చించివేయడం వంటి ఘటనలు ప్రజాస్వామ్య విరుద్ధమన్నారు. కేంద్రం గ్యాస్, ఇంధన ధరలు పెంచడంతో ప్రజల పరిస్థితి దయనీయంగా మారిందన్నారు. సమావేశంలో నియోజక వర్గ ఇన్ఛార్జి బత్తెయ్యనాయుడుతో పాటు పలువురు పార్టీ నేతలు పాల్గొన్నారు.
related stories
-
ఆంధ్ర ప్రదేశ ముఖ్యాంశాలు తమ్మినేని ఒత్తిళ్లతోనే నాపై కేసులు: కూన రవికుమార్
-
ఆంధ్ర ప్రదేశ ముఖ్యాంశాలు మీరు అసలు మనుషులేనా... ఇదేనా పాలన?: చంద్రబాబు
-
ఆంధ్ర ప్రదేశ ముఖ్యాంశాలు అన్నం పెట్టలేక గురుకులాలను మూసేశారు: చంద్రబాబు