Wednesday, 01 Nov, 5.44 am ఈనాడు

రాజన్న
జాతీయ కవి సమ్మేళనాలకు పత్తిపాక మోహన్‌


సిరిసిల్ల(సాంస్కృతికం), న్యూస్‌టుడే: సిరిసిల్లకు చెందిన కవి, రచయిత పత్తిపాక మోహన్‌ జాతీయ కవి సమ్మేళనానికి ఎంపికయ్యారు. విజయవాడలో జరిగే రెండో జాతీయస్థాయి కవి సమ్మేళనాల్లో పాల్గొనేందుకు మోహన్‌కు ఆహ్వానం అందింది. మోహన్‌ నేషనల్‌ బుక్‌ ట్రస్ట్‌ తెలుగు విభాగం సహాయ సంపాదకులుగా ఉన్నారు. సమ్మేళనాలకు వివిధ భాషలకు చెందిన కవులు హాజరవుతారు. చేనేత ఆత్మహత్యలపై కవితలను సమ్మేళనంలో వినిపించబోతున్నారు. 24 మంది భాషా కవులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. మోహన్‌ను మానేరు రచయితల సంఘం ప్రతినిధులు రవి, అశోక్‌ అభినందించారు.

Dailyhunt
Top