Saturday, 26 May, 5.11 am ఈనాడు

సినిమా
జనానికి ఇవేమీ అక్కర్లేదు

జనానికి ఇవేమీ అక్కర్లేదు

ఇంటర్నెట్‌డెస్క్‌: ఎన్నో చిత్రాల్లో నటించిన పలు కీలకపాత్రలు పోషించిన అలనాటి తార ఋషేంద్రమణి. ఆమె తొలిసారిగా 'శ్రీకృష్ణ తులాభారం' (1935)లో సత్యభామగా నటించారు. ఆ సినిమా కలకత్తాలో తీశారు. (రేలంగికీ ఇది మొదటి సినిమా). సత్యభామ వనవిహారం చేసే దృశ్యంలో ఎక్కువగా క్రోటన్స్‌ మొక్కలు, బోగన్‌ విలియా మొక్కలూ కనిపించాయట. 'ఇదేమిటి ఈ వనంలో ఈ మొక్కలు పెట్టారు? ఇవి విదేశాల నుంచి వచ్చినవి. ఆ కాలంలో లేవు కదా' అని దర్శకుడిని అడిగారట. ముఖర్జీ అనే ఆయన ఆ చిత్రం దర్శకుడు. తెలుగు, మాటలు పాటలు, పద్యాలు రాజారావు అనే ఆయన రాశారు. 'అమ్మా! ఆ కాలంలో ఈ మొక్కలు లేవని ఎలా చెప్పగలం? ఏ మొక్కలు ఉండేవో ఏవి లేవో ఎవరు చెప్పగలరు? క్రోటన్స్‌ మీకు దగ్గరగా ఉన్నాయి కాబట్టి కనిపించాయి. వాటికి పువ్వులుండవు.

కానీ, పువ్వులు పెట్టాం కదా. అందుకే మొక్క మారిపోయింది. అయినా, జనానికి ఇవేమీ అక్కర్లేదు. ఎవరూ పట్టించుకోరు.

విస్తారంగా మొక్కలు కనిపించాలి కాబట్టి ఇవన్నీ పెట్టాం' అని చెప్పారట.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Eenadu
Top