Saturday, 14 Sep, 5.30 am ఈనాడు

మెదక్
జిల్లా ఇంటర్‌ విద్యాధికారిగా సూర్యప్రకాశ్‌

మెదక్‌ అర్బన్‌, న్యూస్‌టుడే: జిల్లా ఇంటర్‌ విద్యాధికారిగా అదనపు బాధ్యతలు స్వీకరించిన ఇంటర్‌ విద్య నోడల్‌ అధికారి సూర్యప్రకాశ్‌ శుక్రవారం మెదక్‌ ప్రభుత్వ బాలుర కళాశాలను సందర్శించారు. ప్రిన్సిపల్‌, సిబ్బంది ఆయన్ను సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అద్యాపకులు, సిబ్బంది సమయపాలన పాటించాలన్నారు. విద్యార్థుల పరీక్ష ఫలితాలకు సంబంధించి పలు సూచనాలు చేశారు. ఆర్‌జేడీ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు సురేశ్‌బాబు, ఒప్పంద అధ్యాపకులు తదితరులు ఉన్నారు.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Eenadu
Top